జిమ్ లో అనసూయ పార్టనర్స్ వీరే! ఆయన పని మాత్రం జోరుగా ఉంది!

Published : Jun 14, 2023, 05:30 PM IST
జిమ్ లో అనసూయ పార్టనర్స్ వీరే! ఆయన పని మాత్రం జోరుగా ఉంది!

సారాంశం

అనసూయ భర్త సుశాంక్, చెల్లితో జిమ్ చేశారు. ముగ్గురు కలసి జిమ్ పిట్ లో ఫోజులు ఇచ్చారు. సుశాంక్ అటు మరదలిని ఇటు భార్యను పెట్టుకొని జిమ్ చేశాడు. ఈ ఫోటో చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి. చక్కని శరీరాకృతి సాధించాలంటే జిమ్ లో కష్టపడక తప్పదు. ప్రతి వీకెండ్ అనసూయ కఠిన కసరత్తులు చేస్తూ చెమటలు కక్కిస్తారట. అనసూయ తన వర్క్ అవుట్ వీడియో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. జిమ్ ఫిట్ లో బరువులు ఎత్తుతూ తెగ కష్టపడుతున్న అనసూయ కమిట్మెంట్ కి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. మేడం మీరు కేక అంటూ కితాబు ఇస్తున్నారు. నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్న అనసూయ స్లిమ్ బాడీ మైంటైన్ చేయాలంటే వ్యాయామం చేయక తప్పదు. నటిగా రాణించాలంటే అందం, ఆరోగ్యం రెండూ కావాలి. 

తాజాగా ఆమె భర్త సుశాంక్, చెల్లితో జిమ్ చేశారు. ముగ్గురు కలసి జిమ్ పిట్ లో ఫోజులు ఇచ్చారు. సుశాంక్ అటు మరదలిని ఇటు భార్యను పెట్టుకొని జిమ్ చేశాడు. ఈ ఫోటో చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ వైరల్ అవుతుంది.

కాగా అనసూయ విమానం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని, ఆమె పాత్రను పొగడ్తలతో పేక్షకులు ముంచెత్తుతున్నారు. దీంతో అమ్మడు ఉబ్బితబ్బిబ్బవుతుంది. వేశ్య పాత్ర చేయాలంటే గట్స్ ఉండాలి. అవి తనకు ఉన్నాయని అనసూయ నిరూపించింది.

క్రిటిక్స్ ప్రశంసలతో పాటు కలెక్షన్స్ కూడా ఈ చిత్రం రాబడుతుంది. కాగా అనసూయ ఖాతాలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. దర్శకుడు సుకుమార్ భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్-రష్మిక మందాన జంటగా నటిస్తున్న ఈ క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ మీద దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. పుష్ప 2లో అనసూయ నెగిటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాక్షాయణిగా అనసూయ పాత్రకు సుకుమార్ పుష్ప 2లో ఎలాంటి ముగింపు ఇచ్చాడో చూడాలి. 

ప్రస్తుతం అనసూయ ఫోకస్ మొత్తం నటన మీదే. ఆమె యాంకరింగ్ పూర్తిగా మానేశారు. ఇకపై అటువైపు వచ్చేది లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఫేమ్ తెచ్చి పెట్టిన జబర్దస్త్ మీద కూడా అనసూయ పరోక్షంగా విమర్శలు చేయడం విశేషం.  అనసూయ జబర్దస్త్ మానేసి దాదాపు ఏడాది కావస్తుంది. 

PREV
click me!

Recommended Stories

వాలెంటైన్స్ డే స్పెషల్ .. ఫిబ్రవరి 13న రిలీజ్ అవ్వబోతున్న నిలవే సినిమా
Renu Desai : నాకంటూ ఎవరు లేరు, ఎవరికి చెప్పుకోలేను, పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఎమోషనల్ కామెంట్స్