ది మ్యాడ్ క్వీన్ గా అనసూయ... మైఖేల్ మూవీ నుండి ఫస్ట్ లుక్ అవుట్! 

By Sambi ReddyFirst Published Jan 18, 2023, 4:53 PM IST
Highlights

అనసూయ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో మైఖేల్ చిత్రం ఒకటి. ఈ చిత్రం నుండి ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేయగా ఆసక్తిరేపుతోంది. 
 

యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసిన అనసూయ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్నారు. ఆమె ఖాతాలో బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ మైఖేల్ లో ఆమె కీలక రోల్ చేస్తున్నారు. నేడు మైఖేల్ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆమె లుక్ చాలా ఫెరోషియస్ గా ఉంది. చేతిలో ఆయుధం పట్టుకొని ఉన్న అనసూయ కళ్ళల్లో కసి స్పష్టంగా కనిపిస్తుంది. ది మ్యాడ్ క్వీన్ అని ఆమెను పరిచయం చేయడం ఆలోచింపజేస్తుంది. 

మైఖేల్ చిత్రంలోని తన ఫస్ట్ లుక్ అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. గౌరవం, రాజసంతో కూడుకున్న పాత్రగా అనసూయ కామెంట్ రూపంలో అభివర్ణించారు. మొత్తంగా మైఖేల్ మూవీలో అనసూయ కీలక పాత్ర చేస్తున్నారని అర్థం అవుతుంది. సందీప్ కిషన్ పాన్ ఇండియా చిత్రంగా మైఖేల్ విడుదల చేస్తున్నారు. రంజిత్ జయకోడి దర్శకుడు కాగా విజయ్ సేతుపతి కీలక రోల్ చేస్తున్నారు. 

దర్శకుడు గౌతమ్ మీనన్ వాసుదేవ్ సైతం నటిస్తున్నారు. దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందించారు. అవుట్ అండ్ అవుట్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతుంది. గతంలో విడుదలైన మైఖేల్ టీజర్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచేసింది. 

సరైన హిట్ లేక అల్లాడుతున్న సందీప్ కిషన్ ఈ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశపడుతున్నారు. సందీప్ తెలుగు, తమిళ భాషల్లో వరుసగా చిత్రాలు చేస్తున్నారు. క్లీన్ హిట్ దక్కి చాలా కాలం అవుతుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సందీప్ కిషన్ కెరీర్లో అతి పెద్ద హిట్ గా ఉంది. ఆ స్థాయి విజయం మరలా సందీప్ కి దక్కలేదు. కొన్ని యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా ఆడలేదు. 

ఇక అనసూయకు మైఖేల్ మరొక పాన్ ఇండియా మూవీ. పుష్ప 2 ఆమె ఖాతాలో ఉన్న భారీ బహుభాషా చిత్రం. పుష్ప పార్ట్ 1 పెద్ద విజయం సాధించింది. దీంతో సీక్వెల్ అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు. మూవీ బడ్జెట్ దాదాపు రెట్టింపు చేశారు. అలాగే ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ 'వూల్ఫ్" మూవీలో అనసూయ నటిస్తున్నారు. అలాగే రంగమార్తాండ, భోళా శంకర్ చిత్రాల్లో నటిస్తున్నట్లు సమాచారం. 
 

click me!