'ఏ' సర్టిఫికెట్ సినిమాకి కమిటైన వకీల్ సాబ్ నటి .. పిల్ల బచ్చాలు అంటూ వార్నింగ్

Published : Feb 23, 2024, 05:41 PM IST
'ఏ' సర్టిఫికెట్ సినిమాకి కమిటైన వకీల్ సాబ్ నటి .. పిల్ల బచ్చాలు అంటూ వార్నింగ్

సారాంశం

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. అయితే ఇటీవల అనన్యకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. 

మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. 

అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో బాగా నటించింది. అనన్య ఆ తరహా పాత్రలే కాదు గ్లామర్ రోల్స్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో గ్లామర్ సంకేతాలు వదులుతోంది. కానీ అనన్యకి సరైన గ్లామర్ రోల్ మాత్రం పడడం లేదు. 

దీనితో అనన్య వైవిధ్యమైన కంటెంట్ తో ఉన్న చిత్రాలపై దృష్టి పెడుతోంది. తాజాగా ఆమె 'ఏ' సర్టిఫికెట్ చిత్రానికి కమిటైంది. 'ఏ' సర్టిఫికెట్ అంటే ఇంకేదో అని భావించవద్దు. ఆమె నటిస్తున్న చిత్రం హారర్ జోనర్. ఈ చిత్రం పేరు తంత్ర. హర్రర్ కంటెంట్ కావడంతో సెన్సార్ సభ్యులు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ క్రేజీగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు చిత్ర యూనిట్. 

పిల్ల బచ్చాలు మా సినిమాకి రావద్దు. ఎందుకంటే మాది 'ఏ' సర్టిఫికెట్ సినిమా అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. టెడ్డీబేర్‌కి మీరు జోలపాడితే బాగుంటుంది.. కానీ ఆ టెడ్డీబేర్ మీకు జోల పాడితే..ఆ ఊహే భయంకరంగా ఉంది కదా! అలాంటిదే ఈ 'తంత్ర' సినిమా.మార్చి 15న మీ ముందుకు వస్తోంది.మీరు సిద్ధమా? అంటూ చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. అనన్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 15న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు