`సర్కారు వారి పాట`పై ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌.. ఎక్కడున్నా సినిమా చూస్తానంటూ పోస్ట్.. ఎందుకంటే?

Published : May 30, 2022, 08:55 AM IST
`సర్కారు వారి పాట`పై ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌.. ఎక్కడున్నా సినిమా చూస్తానంటూ పోస్ట్.. ఎందుకంటే?

సారాంశం

మహేష్‌బాబు నటించిన `సర్కారు వారి పాట` చిత్రంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది.

మహేష్‌బాబు(Maheshbabu) నటించిన `సర్కారు వారి పాట`(Sarkaru Vaari Paata)మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి మొదట నెగటివ్‌ టాక్‌ వచ్చినా, కలెక్షన్ల పరంగా దుమ్మరేపింది. వంద కోట్లకుపైగా షేర్‌ని సాధించింది. రెండువందల కోట్ల(గ్రాస్‌) క్లబ్‌లో చేరింది. ఇందులో మహేష్‌ సరికొత్త మ్యానరిజం, కీర్తిసురేష్‌ అందాలు, నటన, పరశురామ్‌ టేకింగ్‌, బోల్డ్ డైలాగ్‌లు, సీన్లు సినిమాకి ప్లస్‌ అయ్యాయి. సంగీతం మరో స్పెషల్‌ హైలైట్‌. దీంతో సినిమా నష్టాల నుంచి గట్టేక్కింది. 

ఇదిలా ఉంటే ఈ చిత్రంపై ప్రముఖ ఆటోమోబైల్‌ మహీంద్ర గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్ర(Anand Mahindra) స్పందించడం, ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతుంది.ప్రముఖ ఆటోమోబైల్‌కి చెందిన వ్యాపారవేత్త అనుపమ్‌ తరేజా చేసిన పోస్ట్ కి ఆనంద్‌ మహీంద్ర రియాక్ట్ అయ్యారు. `సర్కారు వారి పాట` సినిమాని కచ్చితంగా చూస్తానని తెలిపారు. మరి ఇంతక అనుపమ్‌ తరేజా ఏం పోస్ట్ చేశారంటే, `సర్కారు వారి పాట` చిత్రంతో మహేష్‌బాబు `జావా మెరూన్‌`(Jawa Maroon) అనే ఖరీదైన బైక్‌ని వాడతారు. మహేష్‌, జావా కాంబినేషన్‌ అద్భుతంగా ఉందని, సినిమా సక్సెస్‌లో భాగమైందని, సినిమా సక్సెస్‌తో దేశ వ్యాప్తంగా మహేష్‌ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని, ఈ సినిమాని చూడాలని ఆయన ట్వీట్‌ చేశారు. 

దీనికి రియాక్ట్ అయ్యారు ఆనంద్‌ మహీంద్ర. అనుపమ్‌ తరేజా పోస్ట్‌ చేసిన ఓ వీడియోకు స్పందనగా రీట్వీట్‌ చేస్తూ, `అన్‌బీటబుల్‌ కాంబినేషన్‌ అయిన సూపర్‌ స్టార్‌ మహేష్‌‌ బాబు, జావా మెరూన్‌లను చూడకుండా ఎలా ఉండగలను. ప్రస్తుతం నేను న్యూయార్క్‌లో ఉన్నాను. న్యూ జెర్సీకి వెళ్లి సినిమా ఎక్కడ ప్రదర్శించబడితే అక్కడికి వెళ్లి చూస్తాను` అని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే జావా మెరూన్‌ మహీంద్ర గ్రూప్‌కి సంబంధించి ఆటోమోబైల్‌కంపెనీలో ఒకటి. మహీంద్ర గ్రూప్‌ లాంచ్‌ చేసిన జావా మెరూన్‌ మంచి ఆదరణ పొందుతుంది. ఈ నేపథ్యంలో మహేష్‌ ఈ బైక్ ని `సర్కారు వారిపాట` చిత్రంలో వాడటంతో దాన్ని ప్రమోట్‌ చేసినట్టయ్యింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: మొన్న పుష్ప 2, నేడు ఉస్తాద్.. పాపం దేవిశ్రీ ప్రసాద్ బీజీయం పంచాయతీ ఏంటి..?
Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌