`మర్డర్‌`పై కేసు.. వర్మని కోర్టుకీడ్చిన అమృత వర్షిణి

By Satish ReddyFirst Published Aug 5, 2020, 8:21 AM IST
Highlights

`మర్డర్‌` పేరుతో సినిమా తీస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లో తప్పు చేస్తే చంపడం తప్పా అనే డైలాగులు వాడారు. అమృత భర్త ప్రణయ్‌ని హత్య చేసిన మాదిరిగానే సినిమాలోని సీన్‌ని పెట్టారు. దీంతో దీనిపై అమృత అభ్యంతరం తెలిపారు. సినిమా చిత్రీకరణను ఆపాలంటూ.. మృతుడు ప్రణయ్‌ భార్య, మృతి చెందిన మారుతిరావు కూతురు, కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన పెరుమాల్ల అమృత గత నెల 29న నల్గొండ జిల్లా కోర్టులో సివిల్‌ దావాను దాఖలు చేశారు. 

వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వివాదాల్లో ఇరుక్కున్నాడు. తాను ప్రస్తుతం రూపొందిస్తున్న `మర్డర్‌`పై సినిమాపై కోర్ట్ లో పిటిషన్‌ వేశారు. తనకు జరిగిన
ఘటనపై కించపరిచేలా సినిమా తీస్తున్నారంటూ, దాన్ని ఆపాలంటూ అమృత కోర్ట్ కెక్కింది.  రెండేళ్ల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్‌ పరువు
హత్య కేసు దేశ వ్యాప్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

ఈ ఘటనపై రామ్‌గోపాల్‌ వర్మ `మర్డర్‌` పేరుతో సినిమా తీస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లో తప్పు చేస్తే చంపడం తప్పా అనే డైలాగులు వాడారు. అమృత భర్త
ప్రణయ్‌ని హత్య చేసిన మాదిరిగానే సినిమాలోని సీన్‌ని పెట్టారు. దీంతో దీనిపై అమృత అభ్యంతరం తెలిపారు. సినిమా చిత్రీకరణను ఆపాలంటూ.. మృతుడు ప్రణయ్‌ భార్య,
మృతి చెందిన మారుతిరావు కూతురు, కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన పెరుమాల్ల అమృత గత నెల 29న నల్గొండ జిల్లా కోర్టులో సివిల్‌ దావాను దాఖలు చేశారు. 

 హత్య కేసు విచారణ దశలో ఉందని, కల్పిత కథతో ఉన్న సినిమా విడుదల అయితే సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే సినిమాను నిలుపుదల
చేసేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోర్టును కోరారు. విచారించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ప్రతివాదులు దర్శకుడు రాంగోపాల్‌వర్మ, నిర్మాత నట్టి
కరుణకు అత్యవసర నోటీసులను జారీ చేస్తూ మధ్యంతర పిటిషన్‌ తదుపరి విచారణను ఈ నెల రేపటికి వాయిదా వేశారు.

 కోర్టు ఆదేశాల మేరకు ప్రతివాదులకు నోటీసులను ఈ మెయిల్‌, వాట్సాప్‌ ద్వారా మంగళవారం జారీ చేసినట్లు ఫిర్యాదుదారు న్యాయవాది తెలిపారు. మరోవైపు రెండేళ్లుగా
మానసిక ఒత్తిడికి గురవుతున్న తమపై మర్డర్‌ పేరుతో కల్పిత కథతో సినిమా రూపొందించి తమ జీవితాలతో చెలగాటమాడటం సరికాదంటూ ప్రణయ్‌ భార్య అమృత, తండ్రి
బాలస్వామి పేర్కొన్నట్లు స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో మంగళవారం తెలియజేశారు. 

ఇదిలా ఉంటే ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ని మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. `పిల్లల్ని ప్రేమించడం తప్పా ` అటూ సాగే ఈ పాటను స్వయంగా వర్మనే
ఆలపించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై అనురాగ్ కంచర్ల
సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు.

click me!