అందుకే ఆయన్ని మెగాస్టార్ అనేది!

Published : Oct 20, 2018, 12:52 PM IST
అందుకే ఆయన్ని మెగాస్టార్ అనేది!

సారాంశం

బిగ్ బి అమితాబ్ బచ్చన్ లో నటుడితో పాటు సహాయం చేసే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ముఖ్యంగా రైతులంటే ఆయనకు చాలా ఇష్టం. కష్టపడి పనిచేసే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆయన తట్టుకోలేరు.

వెండితెరపై ఒక్కసారి క్లిక్ అయితే వారికి తిరుగుండదు.  స్టార్ హీరోలను అభిమానులు ఎంతగా ఆరాధిస్తారో అందరికి తెలిసిందే. కొంత మంది నటులు అభిమానులకు కూడా అంతే గౌరవాన్ని ఇస్తారు. ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడానికి ముందుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ మెగాస్టార్ అతి ముఖ్యమైన వారు. మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ లో నటుడితో పాటు సహాయం చేసే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. 

ముఖ్యంగా రైతులంటే ఆయనకు చాలా ఇష్టం. కష్టపడి పనిచేసే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆయన తట్టుకోలేరు. అప్పుల బాదతో సతమతమయ్యే రైతులను ఆదుకునేందుకు ప్రతిసారి ఆయనకు తోచినంత సహాయాన్ని అందిస్తారు. గతంలో మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను అందుకున్నారు. ఇక ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో 850 రైతుల అప్పులను తీర్చేందుకు సిద్ధమయ్యారు. 

5.5కోట్ల అప్పులను తీర్చేందుకు అంతా సిద్ధం చేసుకున్నారని బ్యాంకు అధికారులతో కూడా మెగాస్టార్ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక మహారాష్ట్రలో ప్రస్తుతం 350 మంది పరిస్థితి కూడా కష్టంగా ఉండడంతో వారిని ఆదుకునేందుకు ధనవంతులు ముందుకు రావాలని అమితాబ్ పిలుపునిచ్చారు. అమితాబ్ రైతులకు ఈ విధంగా సహాయం చేస్తుండడంతో అందుకే ఆయన్ను మెగాస్టార్ అంటరాని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Satluj OTT Release: 25000 మిస్సింగ్ కేసుల కథ, సెన్సార్ కష్టాలతో ఏళ్ల తరబడి వాయిదా..ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్
Alpha OTT Release: ఆలియా 'ఆల్ఫా' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?