
బాలీవుడ్ స్టార్ హీరోల్లో అమీర్ ఖాన్ ఒకడు అతడు ఒక్కో సినిమాకి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటాడు. అతని ఆస్తి కూడా తక్కువేమీ కాదు.. దాదాపు 2000 కోట్ల వరకు రూపాయల వరకు ఉంటుంది. ముంబైలో కనీసం 12 ఫ్లాట్లు కూడా ఉంటాయి. అయినా కూడా అమీర్ ఖాన్ తన సొంత ఇళ్లలో కాకుండా అద్దె ఫ్లాట్లోకి మారిపోయాడు. సొంత ఇల్లు ఉండి కూడా ఇలా అద్దె ఫ్లాట్లో ఎందుకు ఉంటున్నాడు?
అద్దె ఎంత?
ఫోర్బ్స్ చెబుతున్న డేటా ప్రకారం అమీర్ ఖాన్‌కు దాదాపు 1862 కోట్ల రూపాయల సంపద ఉంది. ముంబైలో 12 దాకా అపార్టుమెంట్లు ఉన్నాయి. అయినా కూడా ఆయన బాంద్రా వెస్ట్ లో ఒక అద్దె ఇంటిని తీసుకున్నారు. పోలీసులు నాలుగు లక్షలు అపార్ట్మెంట్లను అద్దెకి తీసుకున్నారు. ఈ అపార్ట్మెంట్లన్నింటికీ కలిపి 24 లక్షల అద్దెను చెల్లిస్తున్నారు. ప్రతి ఏడాది ఐదు శాతం పెరుగుతూ ఉంటుంది. రాబోయే ఐదు సంవత్సరాల కోసం ఈ అద్దె ఫ్లాట్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అద్దె ఒప్పందం కోసం కోటి 46 లక్షలకు పైగా సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేశాడు. అమీర్ ఖాన్ ఇక స్టాంప్ డ్యూటీ నాలుగు లక్షల రూపాయలు చెల్లించాడు.
అమీర్ ఖాన్‌కు విర్గో హౌసింగ్ సొసైటీలోనే 12 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అయితే ఈ అపార్ట్మెంట్లు అన్నిట్లోనూ హై ప్రొఫైల్ స్థాయిలో డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. దీన్ని అల్ట్రా ప్రీమియంగా మారుస్తున్నారు. వీటిని సముద్రముఖంగా అంటే ఈ అపార్ట్మెంట్‌ల నుంచి సముద్రం అందంగా కనిపించేలా రీమోడలింగ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అపార్ట్మెంట్ల రేట్లు మరింత పెరుగుతాయి. ఈ ఫ్లాట్ల ధరలు 100 కోట్లు రూపాయలు దాటిపోయే అవకాశం ఉంది. అందుకే అక్కడ అభివృద్ధి పనులు జరిగే వరకు అమీర్ ఖాన్ అద్దె ఇంట్లోకి మారాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ అద్దెకు తీసుకున్న ప్రాంతంలోనే ఎంతోమంది బాలీవుడ్ తారలు నివసిస్తున్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ కూడా అదే ప్రాంతంలో ఉన్నాడు.