బాయ్ ఫ్రెండ్ తో ముంబైలో చక్కర్లు కొడుతున్న స్టార్ హీరో కూతురు!

Published : Jul 11, 2021, 05:19 PM IST
బాయ్ ఫ్రెండ్ తో ముంబైలో చక్కర్లు కొడుతున్న స్టార్ హీరో కూతురు!

సారాంశం

ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఈ జంటను కెమెరా మెన్స్ క్లిక్ మనిపించారు. ఏదో షాపింగ్ కోసం బయటికి వచ్చిన నుపుర్, ఐరా రోడ్డుపై అలా కబుర్లు చెప్పుకుంటూ నడిచివెళుతున్నారు.   

బాలీవుడ్ స్టార్స్ మధ్య అఫైర్స్ చాలా సహజం. అలాగే స్టార్స్ పిల్లకు కూడా టీనేజ్ కి చేరుకోగానే తమ బాయ్ ఫ్రెండ్స్ ని బహిరంగంగానే ప్రకటించేస్తారు. అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ సైతం కొంత కాలం నుండి ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే ప్రేమలో పడిన ఆమె అతనితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. 


తమ రిలేషన్ అధికారికంగా ప్రకటించిన ఈ జంట సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా మరోమారు వీరు కెమెరా కంటికి చిక్కారు. ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఈ జంటను కెమెరా మెన్స్ క్లిక్ మనిపించారు. ఏదో షాపింగ్ కోసం బయటికి వచ్చిన నుపుర్, ఐరా రోడ్డుపై అలా కబుర్లు చెప్పుకుంటూ నడిచివెళుతున్నారు. 


అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తకు ఇద్దరు పిల్లలు కాగా, వారిలో అమ్మాయి ఐరా ఖాన్. రీనా దత్తాకు విడాకులు ఇచ్చిన అమీర్ ఖాన్ రెండవ వివాహంగా కిరణ్ రావ్ ని చేసుకున్నారు. ఇక కిరణ్ రావ్ తో కూడా విడిపోతున్నట్లు అమీర్ ఖాన్ ఇటీవల ప్రకటించారు. కిరణ్ రావ్ తో విడాకులపై ఐరా ఖాన్ స్పందించారు. పరోక్షంగా ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ చేయడం జరిగింది. 
 

PREV
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?