
సమంత అక్కినేని నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 12న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కావాల్సి ఉండగా.. దానిని మళ్లీ వాయిదా వేస్తున్నట్లు దర్శకులు ప్రకటించారు. దిఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుసు. మీ అందరికీ ఒక సూపర్ ఎక్స్పీరియన్స్ అందించాలని ఈ సిరీస్ వేసవికి వాయిదా వేస్తున్నాం అంటూ దర్శకులు తెలిపారు.
అయితే ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరిస్ పూర్తిగా అమేజాన్ ప్రైమ్ ఆపేస్తున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. అందుకు కారణం ...కేంద్ర ప్రభుత్వం డిజిటెల్ మీడియా మీద వర్తింపచేయబోతున్న రూల్స్ అని అంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందీ అంటే..ఇదంతా బుల్ షిట్ అని ఫ్యామిలీ మ్యాన్ కి చెందిన డైరక్టర్ కొట్టిపారేసారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన వస్తుందని అన్నారు. సామ్ నటించిన ఈ వెబ్ సిరీస్ వాయిదా పడడానికి కారణం అమెజాన్ ప్రైమ్ వివాదంలో ఉండటమే కావచ్చు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో మిర్జాపూర్, తాండవ్ వెబ్ సిరీస్‌లు వివాదాల్లో చిక్కుకున్నాయి. ఆ కారణంగానే సమంత వెబ్ సిరీస్ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.
ఇందులో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత కీలక పాత్రలలో నటిస్తుండగా.. సామ్ టెర్రరిస్ట్‌గా కనిపిచనున్నట్లుగా టాక్. తొలి సిరీస్‌కు మంచి ఆదరణ లభించడంతో రెండో సీజన్ లో నటించేందుకు సమంత సిద్ధమైంది. ఇందులో విలన్‌గా సమంత నటిస్తుందని తెలుస్తుండగా,ఈ సిరీస్ ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. వాయిదా వేశారు. తాజాగా సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ‘‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. మీ అందరికీ ఓ సూపర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలని విడుదలను వేసవికి వాయిదా వేస్తున్నాం’’ అన్నారు.