
కొన్ని వినటానికే వింతగా ఉంటాయి. అభిమానులం అంటూ కొందరు చేసే పనులు మీడియాలో వైరల్ అవుతూంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక అనేక వింతలు కనపడుతున్నాయి. తాజాగా ‘నారప్ప’ ఓటీటి రిలీజ్ ఆపాలంటూ ఓ అభిమాని నిరాహార చేస్తున్నానంటూ ప్రకటించటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు ఓ పోస్ట్ సోషల్ మీడియా లో కనపడుతోంది. ఎవరతను..ఎక్కడవాడు ..ఎక్కడ ఈ నిరాహార దీక్ష పోగ్రాం పెట్టుకున్నాడు వంటి వివరాలు ఇక్కడ చూడండి.
వివరాల్లోకి వెళితే...సినిమా ను ఓటీటీ రిలీజ్ ను అడ్డుకోవాలంటూ ఆందోళన మొదలు అయ్యింది. వరంగల్ కు చెందిన కిరణ్... నారప్ప సినిమా ఓటీటీ రిలీజ్ కు వ్యతిరేకంగా ఒక్క రోజు నిరాహార దీక్ష ను చేపట్టాడు. సినిమా ను ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నాడు. నా వంతుగా నేను ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన కిరణ్ ఇతర వెంకటేష్ అభిమానులకు కూడా ఆదర్శంగా నిలిచాడు.
వెంటనే నారప్ప సినిమా ఓటీటీ విడుదలకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలంటూ సూచించాడు. కిరణ్ షేర్ చేసిన ఈ ఫొటో వైరల్ అవుతోంది. నారప్ప ఓటీటీ వద్దంటూ నెట్టింట వరుస ట్వీట్స్ తో ఏకంగా నారప్ప హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ గా ట్రెండ్ అయ్యింది. మరి నారప్ప రిలీజ్ ని సురేష్ బాబు ఆపుతారో లేదో చూడాలి.
ఇక ఇంతకు ముందు నారప్ప కేవలం థియేటర్ రిలీజ్ మాత్రమే అని చెప్పిన నిర్మాత సురేష్ బాబు నిర్ణయం మార్చుకుని డైరక్ట్ ఓటిటి రిలీజ్ వైపు ప్రయాణం పెట్టుకున్నట్లు సమాచారం. ఈ మేరకు అమేజాన్ ప్రైమ్ తో డైరక్ట్ రిలీజ్ డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అఫీషియల్ గా ప్రకటన అయితే ఇప్పటిదాకా లేదు.
స్టార్ హీరో వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నారప్ప’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదటి నిర్ణయించిన మేరకు మే 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే గత కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా ఉన్న దారుణ కరోనా పరిస్థితుల రీత్యా ‘నారప్ప’ విడుదలను వాయిదా వేసారు. ఇప్పుడు డైరక్ట్ ఓటిటి రిలీజ్ పెట్టారు.
‘‘తమిళంలో విజయవంతమైన ‘అసురన్’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందిస్తున్నాం. వెంకటేష్ రెండు విభిన్నమైన అవతారాలలో మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తారు. ఆయన భార్య సుందరమ్మగా ప్రియమణి గుర్తుండిపోయే పాత్ర చేస్తోంది. తాజాగా నిర్మాణాంతర పనులు పూర్తయ్యాయి. వారం రోజుల్లో తొలి కాపీ రెడీ అవుతుంది. త్వరలో కొత్తవిడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాం’’ అని చెప్పారు చిత్ర నిర్మాతలు.
సమాజంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న కుల వ్యవస్థ, దానివల్ల ఎదురయ్యే సమస్యలు గురించి తెలియజేసే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు.