సంచలనాలకు అమలాపాల్ రెడీ.. 'ఆమె' ఎప్పుడంటే!

Published : Jul 02, 2019, 05:59 PM IST
సంచలనాలకు అమలాపాల్ రెడీ.. 'ఆమె' ఎప్పుడంటే!

సారాంశం

క్రేజీ హీరోయిన్ అమలాపాల్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆమె'. ఇటీవల అమలాపాల్ నటిస్తున్న చిత్రాలు ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తున్నాయి. అమలాపాల్ బోల్డ్ రోల్స్ లో నటిస్తూ ఆశ్చర్యపరుస్తోంది.

క్రేజీ హీరోయిన్ అమలాపాల్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆమె'. ఇటీవల అమలాపాల్ నటిస్తున్న చిత్రాలు ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తున్నాయి. అమలాపాల్ బోల్డ్ రోల్స్ లో నటిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. 'ఆమె' చిత్రంలో అమలాపాల్ సాహసోపేతమైన పాత్రలో నటించింది. 

ఇటీవల విడుదలైన టీజర్ లో అమలాపాల్ న్యూడ్ గా కనిపించి సంచనలం రేపింది. సినిమాలో అమలాపాల్ మరింతగా రెచ్చిపోయిందట. ఈ చిత్ర కథలో భాగంగా అమలాపాల్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించినట్లు తెలుస్తోంది. రత్నకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరక్కుతోంది. 

తాజాగా ఈ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. జులై 19న 'ఆమె' చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రిలీజ్ చేస్తున్నారు. ప్రదీప్ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు