రిలీజ్ కు సిద్దమైన అంబరీష్ చివరి చిత్రం!

Published : Nov 28, 2018, 10:38 AM IST
రిలీజ్ కు సిద్దమైన అంబరీష్ చివరి చిత్రం!

సారాంశం

కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రముఖుల సమక్షంలో కోట్లాది మంది అభిమానుల ప్రేమతో అంత్యక్రియలు ముగిసాయి. సినీ తారలు అంబరీష్ మరణాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు.

కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రముఖుల సమక్షంలో కోట్లాది మంది అభిమానుల ప్రేమతో అంత్యక్రియలు ముగిసాయి. సినీ తారలు అంబరీష్ మరణాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. మంచి స్నేహితున్నీ కోల్పోయామంటూ ఎంతో ఆవేదన చెందుతున్నారు. 

అయితే అంబరీష్ నటించిన చివరి చిత్రం  అంబి నింగె వయస్సాయ్తోను శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అసలైతే ఈ సినిమా గత సెప్టెంబర్ నెల 27న రిలీజయ్యింది. మంచి ఆదరణ కూడా దక్కింది. ఈ వయస్సులో కూడా అంబరీష్ ,మంచి ఎనర్జీతో అదరగొట్టేశాడని ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆయన చివరి చిత్రం కావడంతో అభిమానుల కోరిక మేరకు మరోసారి సినిమాను రిలీజ్ చేయనున్నారు. 

ఈ విషయాన్నీ నిర్మాత జాక్‌ మంజునాథ్‌ తెలియజేశారు. ఇక షోల ద్వారా వచ్చే డబ్బును రీసెంట్ గా పాండవపుర ప్రైవేటు బస్సు ప్రమాదంలో మృతి చెందిన 30 మంది బాధిత కుటుంబాలకు సహాయంగా అందాయజేయనున్నట్లు నిర్మాత తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది