అల్లు ఫ్యామిలీ...ఇండస్ట్రీకి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు

Surya Prakash   | Asianet News
Published : Oct 01, 2020, 02:17 PM IST
అల్లు ఫ్యామిలీ...ఇండస్ట్రీకి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు

సారాంశం

ఇప్పటికే దగ్గుపాటి ఫ్యామిలీ రామానాయుడు స్టూడియోస్ ని, అక్కినేని ఫ్యామిలీ అన్నపూర్ణ స్టూడియోస్ ని రన్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అల్లు ఫ్యామిలీ సైతం అల్లు స్టూడియోని ప్రారంభించారు. ఇదొక లార్జ్ స్కేల్ ఫిల్మి స్టూడియో కానుంది. 


ప్రముఖ నిర్మాత అల్లు అరవిద్, మరియు ఆయన కుమారుడు స్టార్ అల్లు అర్జున్ తన సొంత సినీ స్టూడియోని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే దగ్గుపాటి ఫ్యామిలీ రామానాయుడు స్టూడియోస్ ని, అక్కినేని ఫ్యామిలీ అన్నపూర్ణ స్టూడియోస్ ని రన్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అల్లు ఫ్యామిలీ సైతం అల్లు స్టూడియోని ప్రారంభించారు. ఇదొక లార్జ్ స్కేల్ ఫిల్మి స్టూడియో కానుంది. అసలు అల్లు ఫ్యామిలీ ఇలా ఓ స్టూడియో నిర్మిస్తుందని ఎవరూ ఊహించలేదు. వార్తలు సైతం లీక్ కాలేదు. దాంతో ఇండస్ట్రీ వారికి ఇదొక షాక్ గా మారింది. 
 
తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నట దిగ్గజంగా పేరొందిన అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అల్లు రామలింగయ్య జయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులో అల్లు స్టూడియోస్ ప్రారంభించారు.  సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా ఈ స్టూడియో భారీస్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది.

ఈ అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిర్మాత అల్లు బాబీ పాల్గొన్నారు. తన ముగ్గురు తనయులతో కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అల్లు అరవింద్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. స్టూడియో ప్రారంభించడంపై అల్లు అరవింద్ త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు