Allu Arjun: అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్.. ఫ్యామిలీ ఫోటో షేర్ చేస్తూ..

By Mahesh Jujjuri  |  First Published Nov 14, 2023, 6:39 PM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్ పెట్టారు. తన ఫ్యామిలీ పోటో ఒకటి శేర్ చేస్తూ.. శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇంతకీ బన్నీ ఎవరిని విష్.. చేశారు.. ఎందుకు. 


అయితే షూటింగ్ లేకుంటే.. ఇల్లు.. అప్పుడప్పుడు పార్టీలు.. కాని చెప్పుకోవాలి అంటే.. పక్కాగా ఫ్యామిలీ మెన్ అని చెప్పచ్చు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను. షూటింగుల్లో  ఎంత బిజీగా ఉన్నా.. ఎక్కడ ఉన్నా.. తన ఫ్యామిలీ విషయంలో మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండడు బన్నీ. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీని వెంటేసుకుని వెళ్తాడు. ... తన కుటుంబానికి బన్నీ వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించేందుకు ప్రయత్నిస్తుంటాడు. బన్నీ కానీ, ఆయన భార్య స్నేహ కానీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోల్లో ఫ్యామిలీ పిక్స్, వారి పిల్లల ఫొటోలే ఎక్కువగా ఉంటాయి.

అంతే కాదు.. బన్నీ కూడా తన సోషల్ మీడియా పేజ్ లో ఎప్పుడూ.. తన పిల్లలు, ఫ్యామిలీ ఫోటోలే ఎక్కువగా ఉంటాయి. ప్రీ ఫెస్టివల్ ను.. ప్రతీ అకేషన్ ను పక్కాగా సెలబ్రేట్ చేస్తూ.. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు బన్నీ. అంతే కాదు తన పిల్లలు చేసే అల్లరి... వారి ముద్దు ముద్దు మాటలను.. తన భార్యతో పాటుతాను కూడా నెట్టింట్లో అప్ లోడ్ చేస్తూ.. సందడి చేస్తుంటాడు. ఇక తాజాగా బన్నీ పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయ్యింద.

Latest Videos

 

Happy Children’s Day . pic.twitter.com/F9hwlNjDqN

— Allu Arjun (@alluarjun)

 తాజాగా చిల్డ్రెన్స్ డే సందర్భంగా భార్య, పిల్లలతో ఉన్న పిక్ ను బన్నీ షేర్ చేశారు. హ్యాపీ చిల్డ్రెన్స్ డే అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల విషయానికి వస్తే... అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా 'పుష్ప 1'కి మించి హిట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

click me!