అల్లు అర్జున్ మాటకు నో అంటోన్న కూతురు!

Published : Feb 08, 2019, 03:19 PM IST
అల్లు అర్జున్ మాటకు నో అంటోన్న కూతురు!

సారాంశం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇద్దరు పిల్లలు. అల్లు అయాన్ తరువాత వారికి పుట్టిన అమ్మాయిని అర్హ అని పేరు పెట్టుకున్నారు. ఈ ఇద్దరి పిల్లలతో అల్లు అర్జున్ దిగే ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.

తాజాగా అల్లు అర్జున్ తన కూతురు అర్హతో సరదాగా అల్లరి చేస్తోన్న వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఇందులో బన్నీ తన కూతురిని ''నాన్న నేను నువ్వు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పు'' అంటూ తన కూతురిని అడిగితే ఆ చిన్ని పాప మాత్రం 'చేసుకోను..' అంటూ నవ్వుకుంటూ చెప్పినసమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోకి 'మై దొంగ ఫెలో' అంటూ కాప్షన్ ఇచ్చాడు అల్లు అర్జున్. తన కూతురిని ఇంతగా ముద్దు చేయడం పలువురు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు అల్లు అర్జున్. మార్చి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. 

PREV
click me!

Recommended Stories

70 ఏళ్ల వయసులో ప్రభాస్, రణ్ వీర్ సింగ్ కు షాక్ ఇచ్చిన చిరంజీవి, బాక్సాఫీస్ దగ్గర మెగా మూవీ రచ్చ..
ఐటమ్ సాంగ్స్ చేయాలంటే కండీషన్స్ ఒప్పుకోవాల్సిందే, రష్మిక మందన్న షరతులేంటో తెలుసా?