Pushpa 2 : ‘ఇది పుష్పగాడి రూలు’.. పూర్తి డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్..

By Asianet News  |  First Published Jul 21, 2023, 7:28 AM IST

‘పుష్ప : దిరైజ్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.  దాంతో సీక్వెల్ గా వస్తున్న Pushpa 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా బన్నీ మూవీ నుంచి పవర్ ఫుల్ డైలాగ్ ను వదిలి మరింత క్రేజ్ పెంచారు.


‘పుష్ప : ది రైజ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాదిన్నర దాటింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో 2021 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మూవీలోని ‘పుష్పరాజ్’ మేనరిజం, డైలాగ్స్, సాంగ్స్, యాక్షన్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ‘పుష్ప’ ట్రెండ్ ఎంతలా కొనసాగిందో తెలిసిందే. ఇక వెంటనే సీక్వెల్ కూడా రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. Pushpa 2 The Rule టైటిల్ తో రూపుదిద్దుకుంటోంది. 

అయితే, ఈ చిత్రం నుంచి ఇప్పటికే పలు అప్డేట్స్ అందాయి. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటు Where is Pushpa అనే వీడియోనూ రిలీజ్ చేశారు. దానికి దేశ వ్యాప్తంగా మాసీవ్ రెస్పాన్స్ దక్కింది. ఆ అప్డేట్ తర్వాత భారీ స్థాయిలో అంచనాలు పెరగాయి. అటు మార్కెట్ లోనూ పుష్ప డిమాండ్ నెక్ట్స్ లెవల్లో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. నిన్న ‘బేబీ’ మూవీ టీమ్ నిర్వహించిన అప్రిసియేషన్ మీట్ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందే సినిమానూ థియేటర్ లో చూసి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. 

Latest Videos

ఈ కార్యక్రమంలో ‘బేబీ’ యూనిట్ ను, ప్రధాన పాత్రల్లో మెప్పించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, దర్శకుడు సాయి రాజేశ్ ను అభినందించారు. ఆ తర్వాత ఫ్యాన్స్ కోరిక మేరకు ‘పుష్ప2’ నుంచి పవర్ డైలాగ్ ను వదిలారు. ‘వెర్ ఈజ్ పుష్ప’ వీడియో చివర్లో ‘ఇది పుష్పగాడి రూల్’ అంటూ వచ్చిన డైలాగ్ ను పూర్తిగా లీక్ చేశారు. బన్నీ మాట్లాడుతూ.. పుష్ప2 గురించి అప్డేట్ ఇవాల్సి వస్తుందనుకోలేదు. చిరు లీక్స్ లాగే నేను ఓ డైలాగ్ లీక్ చేస్తున్నాను. ‘ఈడంతా జరిగేది ఒక్కటే రూల్ మీద జరుగుతండాది.. పుష్ప గాడి రూల్’ అంటూ పవర్ ఫుల్ గా డైలాగ్ ను పంచుకున్నారు. 

అయితే, ‘పుష్ప : ది రైజ్’లో  ‘తగ్గేదెలే’, ’పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా’ వంటి డైలాగ్స్ ఎంతలా ట్రెండ్ అయ్యాయో తెలిసిందే. ఈ క్రమంలో సీక్వెల్ లోనూ మరింత పవర్ ఫుల్ గా డైలాగ్స్ ను అందించబోతున్నారని అర్థం అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలు కీలక షెడ్యూళ్లను పూర్తి చేశారు. మిగితా పార్ట్ ను వేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)  హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తుండగా.. మరికొందరు స్టార్ కాస్ట్ యాడ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

click me!