పుష్ప2 నుంచి క్రేజీ అప్ డేట్, సెట్ లో అడుగు పెట్టిన పోలీస్ బాస్..

Published : May 18, 2023, 03:09 PM IST
పుష్ప2 నుంచి క్రేజీ అప్ డేట్, సెట్ లో అడుగు పెట్టిన పోలీస్ బాస్..

సారాంశం

ఎప్పుడెప్పుడా అని దేశ వ్యాప్తంగా పుష్ప2 కోసం ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. అందులోనే పుష్ప2 నుంచి అదరిపోయే అప్ డేట్స్ ఇస్తూ.. ఊరిస్తున్నారు మూవీటీమ్. ఇక తాజాగా మరో అప్ డేట్ ను వదిలారు పుష్ప2 టీమ్. 

పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సాధించాడు అల్లు అర్జున్. దేశ వ్యాప్తంగా ఒక ఊపు ఊపేసింది పుష్ప సినిమా. ఇండియన్‌ బాక్సాఫీస్‌ ఈ సినిమా సృష్టించిన  విధ్వంసం అంతా ఇంతాకాదు. ఇక పుష్ప2 కోసం దేశమంతా ఎదురు చూసేలా చేసిది సినిమా. ఇక ఈమూవీ సీక్వెల్ షూటింగ్ జోరుగా సాగుతోంది. అంతకు మించి అన్నట్టుగా షూటింగ్ చేస్తున్నారు. పుష్ప2 కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కోసం అమ్మవారి గెటప్ లో ఉన్న బన్నీ వీడియోను వదిలి.. ఉత్కంట ఇంకా పెంచేశారు మూవీ టీమ్. ఇక తాజాగా మరో అప్ డేట్ కూడా ఇచ్చారు. 

ఇక పుష్పలో చివరిగా క్లైమాక్స్ లో వచ్చినా కాని..  బన్నీ తర్వాత ఆ స్థాయిలో మెరిసిన పాత్ర భన్వర్‌సింగ్‌ షెకావత్‌. మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ నటించిన ఈ పాత్ర పుష్ప2లో హైలెట్ అవ్వబోతోంది. దాంతో ఈయన పాత్రపై కూడా ఉత్కంట కొనసాగుతుంది. కనిపించింది కాసేపే అయినా.. పుష్ప2పై అంచనాలు పెంచాడు ఫాహద్. తన నటనతో మంచి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేశాడు. ఇక సెకండ్‌ పార్ట్‌లో ఫాహద్ పాత్ర వేరే లెవల్లో ఉంటుందని చిత్రబృందం గతం నుంచే చెప్పుకొచ్చింది. ఇక ఫాహద్‌ కు సంబంధించిన కీలక షెడ్యూల్‌ను మేకర్స్‌ కంప్లీట్‌ చేసినట్లు తాజాగా వెల్లడించారు. 

 

అంతే కాదు షూటింగ్‌ లోకేషన్‌లో డైరెక్టర్ సుకుమార్, ఫాహద్‌ ఫాజిల్ మానిటర్‌ స్క్రీన్‌ను చూస్తున్న ఫోటోను శేర్ చేసుకున్నారు మూవీ టీమ్...  ఈ సారి ఆయన ప్రతీకారంతో తిరిగి వస్తాడు అనే ట్యాగ్‌లైన్‌ను కూడా ఈ పోస్ట్ తో పాటు  జత చేశారు. దాంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. ఇక పుష్పపుష్ప ది రైజ్‌..  సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి కలెక్షన్ల్ వర్షం కురిపనించింది.  ఇక ఎలాంటి అంచనాల్లేకుండా హిందీలో విడుదలై అక్కడ కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. హిందీ బెల్ట్‌పై వంద కోట్ల బొమ్మతో బన్నీ తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌