తన హీరోయిన్ ని ట్విట్టర్ లో బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. ఆమె మరీ అతిగా, దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్

By Asianet NewsFirst Published Mar 18, 2023, 4:36 PM IST
Highlights

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బన్నీ ఇటీవల ఏదో విధంగా వార్తల్లో నిలుస్తున్నాడు. పుష్ప చిత్రంతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బన్నీ ఇటీవల ఏదో విధంగా వార్తల్లో నిలుస్తున్నాడు. పుష్ప చిత్రంతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. దీనితో బన్నీ రెమ్యునరేషన్ గురించి కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ సాగుతోంది. ప్రభాస్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. 

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ మరోసారి వార్తల్లో కెక్కాడు. కానీ ఈసారి తన హీరోయిన్ వల్ల. ఆమె ఎవరో కాదు.. వరుడు చిత్రంలో బన్నీకి జోడిగా నటించిన భానుశ్రీ మెహ్రా. వరుడు చిత్రం అప్పట్లో ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. భానుశ్రీ మెహ్రా ఈ చిత్రంతోనే టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. వరుడు రిజల్ట్ కారణంగా భానుశ్రీ మెహ్రా టాలీవుడ్ లో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించి ఇండస్ట్రీకి దూరమైంది. మ్యారేజ్ చేసుకుని సెటిల్ ఐంది. 

అయితే ప్రస్తుతం భాను శ్రీ మెహ్రా యూట్యూబ్ ఛానల్ స్టార్ చేసి అందులో ఫన్నీ వీడియోలు క్రియేట్ చేస్తోంది. తన యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్స్ లో పది విమర్శల పాలవుతోంది. ప్రముఖ సెలెబ్రిటీల ట్వీట్స్ కింద కామెంట్స్ రూపంలో టీనా యూట్యూబ్ ఛానల్ లింక్ పెడుతూ సబ్ స్క్రైబ్ చేసుకోవాలని కోరుతోంది. 

ఈ క్రమంలో అల్లు అర్జున్ పేరుని కూడా ఆమె బాగా వాడేస్తోంది. తాజాగా భాను శ్రీ మెహ్రా.. అల్లు అర్జున్ తనని ట్విట్టర్ లో బ్లాక్ చేశాడని షాకింగ్ పోస్ట్ పెట్టింది. నేను అల్లు అర్జున్ తో కలసి వరుడు చిత్రంలో నటించాను. కానీ ఇప్పటికీ నాకు వేరే పని దొరకలేదు. నా లైఫ్ స్ట్రగుల్స్ లో నేను హ్యూమర్ గమనించాను. నన్ను అల్లు అర్జున్ ట్విట్టర్ లో బ్లాక్ చేశారు. మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి అని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కి అల్లు అర్జున్ తనని బ్లాక్ చేసినట్లుగా ఉన్న పిక్ ని కూడా జోడించింది. 

ఇది షాకింగ్ గా ఉన్నప్పటికీ నమ్మశక్యం గా లేదు అని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. ఆమె సోషల్ మీడియాలో ఒక బోట్ లాగా వ్యవహరిస్తోంది. బన్నీ తనని బ్లాక్ చేసినట్లు ఆమె చేసిన పోస్ట్ పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. నీకన్నా 5వ తరగతి పిల్లలు మంచి జోక్స్ వేస్తారు అని కామెంట్ పెట్టారు. 

If you ever feel like you're stuck in a rut, just remember that I acted in Varudu with Allu Arjun and STILL couldn't get any work. But I've learned to find humor in my struggles – especially now that Allu Arjun has blocked me on Twitter🤷‍♀️ Go subscribe ?https://t.co/mqX2lVNjwx pic.twitter.com/ycSR5yGpfl

— Bhanushree Mehra (@IAmBhanuShree)

మరో నెటిజన్ స్పందిస్తూ.. నువ్వు ప్రతి చోట స్పామ్ పోస్ట్ లు పెడుతున్నావు. నీ యూట్యూబ్ ఛానల్ ని ప్రమోట్ చేసుకునేందుకు లింక్స్ వేస్తున్నావు. అలాగే అందుకే అందరూ నిన్ను బ్లాక్ చేస్తున్నారు. నీ యూట్యూబ్ ఛానల్ చీప్ పబ్లిసిటీ కోసం నీవు నటంచిన సినిమా, యాక్టర్ ని ఇలా ఉపయోగించుకుంటున్నావు అంటూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే భాను శ్రీ మెహ్రా పోస్ట్ పై అల్లు అర్జున్ ఇంకా స్పందించలేదు.యూట్యూబ్ ఛానల్ కోసం మరీ ఇంత అతిగా ప్రవర్తించాలా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

 

click me!