అల్లు అర్జున్ కు అభిమానుల సన్మానం.. గజమాలతో సత్కరించిన ఫ్యాన్స్.. ఫిదా అయిపోయిన బన్ని

Published : Apr 03, 2022, 01:04 PM IST
అల్లు అర్జున్ కు అభిమానుల సన్మానం.. గజమాలతో సత్కరించిన ఫ్యాన్స్.. ఫిదా అయిపోయిన బన్ని

సారాంశం

అల్లు అర్జున్ పై తమకున్న అభిమానాన్ని ఘనంగా చాటి చెప్పారు ఫ్యాన్స్.  గని ప్రీ-రిలీజ్ కోసం విశాఖ పట్టణం వచ్చిన బన్నీకి మర్చిపోలేని రీతిలో సత్కారం చేశారు. 

అల్లు అర్జున్ పై తమకున్న అభిమానాన్ని ఘనంగా చాటి చెప్పారు ఫ్యాన్స్.  గని ప్రీ-రిలీజ్ కోసం విశాఖ పట్టణం వచ్చిన బన్నీకి మర్చిపోలేని రీతిలో సత్కారం చేశారు. 

అల్లు అర్జున్ అంటే ఓ బ్రాండ్. మెగా ప్యామిలీ నుంచి ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినా.. తన టాలెంట్ తో.. సొంతంగా స్టార్ ఇమేజ్ ను సాధించాడు బన్ని. తనకంటూ ఓన్ ఫ్యాన్ బేస్ ను తయారు చేసుకున్నాడు. టాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ గా ఎదిగాడు. ఇక రీసెంట్ గా గని ప్రిరిలీజ్ ఈవెంట్ కోసం వైజాగ్ వచ్చిన  అల్లు అర్జున్ కు మర్చిపోలేని ట్రీట్ ఇచ్చారు ఫ్యాన్స్. 

 

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న సినిమా గని. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో  సిద్దు ,అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్న. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఫైనల్ గా  ఏప్రిల్ 8న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు మూవీ టీమ్. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలను స్పీడ్ అప్ చేశారు. అందులో భాగంగా  విశాఖపట్నంలో గ్రాండ్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు.

ఈ వేడుకకు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం కోసం వైజాగ్ వెళ్ళిన బన్నీకి గ్రాండ్ వెల్కం లభించింది.  ఈ సందర్భంగా విశాఖలోని అభిమానులు అల్లు అర్జున్‌కు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.  అల్లు అర్జున్ కు జేజేలు పలుకుతూ.. తెగ హడావిడి చేశారు. అభిమానులు ఇచ్చిన సర్ ప్రైజ్ తో బన్ని మురిసి పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?