స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సామ్ జామ్ షోకి గెస్ట్ గా వచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు బయటికి రావడం జరిగింది. అల్లు అర్జున్ ని తన క్రేజీ ప్రశ్నలతో సమంత ఇరుకునపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. తన షోలో పాల్గొన్న తమన్నాను సమంత తెరపై లిప్ కిస్ ఇవ్వాలంటే ఈ హీరోకి ఇస్తారని అడుగగా, ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. ఈ తరహా బోల్డ్ క్వశ్చన్స్ మనం ఈ షోలో ఎక్సపెక్ట్ చేయవచ్చు.
ఇక సమంత హోస్ట్ గా నిర్వహిస్తున్న సామ్ జామ్ టాక్ షో కూడా ఈ యాప్ కి మరింత ఆకర్షణ తీసుకువస్తుంది. స్టార్ హీరోయిన్ సమంత తన బుల్లి బుల్లి మాటలతో హోస్ట్ గా ఆకట్టుకుంటున్నారు. చిరంజీవి, విజయ్ దేవరకొండ, రానా, స్పోర్ట్స్ కపుల్ పారుపల్లి కశ్యప్ అండ్ సైనా నెహ్వాల్, తమన్నా ఈ టాక్ షోలో పాల్గొనడం జరిగింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సామ్ జామ్ షోకి గెస్ట్ గా వచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు బయటికి రావడం జరిగింది. అల్లు అర్జున్ ని తన క్రేజీ ప్రశ్నలతో సమంత ఇరుకునపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. తన షోలో పాల్గొన్న తమన్నాను సమంత తెరపై లిప్ కిస్ ఇవ్వాలంటే ఈ హీరోకి ఇస్తారని అడుగగా, ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. ఈ తరహా బోల్డ్ క్వశ్చన్స్ మనం ఈ షోలో ఎక్సపెక్ట్ చేయవచ్చు.
ఉదయ్ పూర్ లో నిహారిక వెడ్డింగ్ ముగించుకొని వచ్చిన అల్లు అర్జున్ ఈ టాక్ షోలో పాల్గొన్నారు. మరో వైపు పుష్ప మూవీ షూటింగ్ నిరవధికంగా సాగుతుంది. దాదాపు ఏడు నెలలుగా బ్రేక్ పడిన షూటింగ్ ని దర్శకుడు సుకుమార్ ఈ మధ్యనే తిరిగి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలలోని నల్లమల అడవులలో పుష్ప షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.