పార్లల్ యూనివర్స్ లో వీరుడిగా అల్లు అర్జున్.. అట్లీ మూవీ షూటింగ్ అప్డేట్ ఇదే

tirumala ANPublished : May 12, 2025 10:25 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ లోనే అత్యంత భారీ చిత్రానికి రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా చిత్రాల దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఇటీవల ప్రకటించారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ లోనే అత్యంత భారీ చిత్రానికి రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా చిత్రాల దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఇటీవల ప్రకటించారు. ఏకంగా 800 కోట్ల బడ్జెట్ లో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. అనౌన్స్మెంట్ వీడియో తోనే దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.

డైరెక్టర్ అట్లీ ఈ చిత్రాన్ని పార్లర్ యూనివర్స్ నేపథ్యంలో సాగే కథతో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో తన కెరీర్ లో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా సరికొత్త గెటప్ తో అలరించబోతున్నారట.

ఈ చిత్ర షూటింగ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వైరల్ గా మారింది. జూన్ నుంచి ఈ చిత్రానికి సంబంధించిన సన్నాహకాలు మొదలవుతాయి. జూన్ మిడిల్ లో అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం వర్క్ షాప్ లో పాల్గొంటారు. అదేవిధంగా మాక్ షూటింగ్, రిహార్సల్స్ కూడా ఉంటాయట. 800 కోట్ల బడ్జెట్ లో రూపొందే చిత్రం కాబట్టి అట్లీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే షూటింగ్ కి ముందుగానే వర్క్ షాప్స్ నిర్వహించబోతున్నారు.

సెప్టెంబర్ నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. జవాన్ తర్వాత అట్లీ నుంచి రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. పార్లర్ యూనివర్స్, ఏలియన్స్ లాంటి కాన్సెప్ట్ లో ఇప్పటివరకు హాలీవుడ్ వాళ్లకు మాత్రమే సాధ్యమైంది. కానీ అట్లీ, అల్లు అర్జున్ తొలిసారి హాలీవుడ్ స్థాయిలో సాహసం చేయబోతున్నడంతో ఆసక్తి నెలకొంది. పార్లల్ యూనివర్స్ లో బన్నీ ఈ చిత్రంలో వీరుడిగా కనిపిస్తారట. 

ఈ చిత్రంలో అండర్ వాటర్ యాక్షన్ హైలైట్ గా నిలవబోతున్నట్లు టాక్. ఈ చిత్రంలో హీరోయిన్లుగా జాన్వి కపూర్, మృణాల్ ఠాకూర్ లాంటి నటీమణులు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ తన మేకోవర్ మార్చుకునే పని లో ఉన్నారు.

Read more Articles on
click me!