బిగ్ బాస్2: దీప్తికి వస్తోన్న ఓట్లు జెన్యూన్ కాదు.. కౌశల్ ఆర్మీ ఫైర్!

By Udayavani DhuliFirst Published Sep 21, 2018, 12:47 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. మొదటి నుండి ఈ షోలో ఏదొక గొడవ జరుగుతూనే ఉంది. అయితే ఈ వారంలో ఆ గొడవలు శృతిమించాయి. ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకునే వరకు వెళ్తూ.. కావాల్సినంత మసాలా అందిస్తున్నారు. 

బిగ్ బాస్ సీజన్ 2 మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. మొదటి నుండి ఈ షోలో ఏదొక గొడవ జరుగుతూనే ఉంది. అయితే ఈ వారంలో ఆ గొడవలు శృతిమించాయి. ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకునే వరకు వెళ్తూ.. కావాల్సినంత మసాలా అందిస్తున్నారు. హౌస్ లో ఫిజికల్ టాస్క్ విషయంలో మగాళ్లతో పోటీ పడుతూ మరీ తన ప్రతిభ చాటుతుంటుంది దీప్తి నల్లమోతు.

హౌస్ లో మిగిలిన వాళ్లతో పోలిస్తే.. దీప్తికి బయట పెద్దగా ఫాలోయింగ్ లేదు. కానీ గత కొద్దిరోజులుగా ఆమె ఓటింగ్ శాతం పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. కౌశల్ కి 60శాతం ఓల్టు నమోదైతే.. దీప్తికి 20 శాతం నమోదయ్యేవి. కానీ ఇప్పుడు కౌశల్ తో సమానంగా ఒకానొక సమయంలో అతడిని బీట్ చేసే రేంజ్ లో ఆమెకు ఓట్లు నమోదయ్యాయి.

అయితే ఇదంతా ఫేక్ ఓటింగ్ అని ఆరోపిస్తోంది కౌశల్ ఆర్మీ. ఓ కంపనీతో డీల్ మాట్లాడుకొని దీప్తి భర్త శ్రీకాంత్ ఇదంతా చేస్తున్నాడని అంటున్నారు. ఆధారాలతో సహా ఈ విషయాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఫేక్ ఐడీల ద్వారా ఓట్లు వేయించుకుంటోందని అందుకే ఆమె ఇంకా హౌస్ లో కొనసాగుతోందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది! 
 

click me!
Last Updated Sep 21, 2018, 12:47 PM IST
click me!