బిగ్ ప్లాన్: మహేష్ ని టార్గెట్ చేసిన అల్లరి నరేష్?

Published : Sep 02, 2019, 05:55 PM IST
బిగ్ ప్లాన్: మహేష్ ని టార్గెట్ చేసిన అల్లరి నరేష్?

సారాంశం

కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అల్లరి నరేష్ గత కొన్నాళ్లుగా వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. సుడిగాడు సినిమా తరువాత ఇంతవరకు అల్లరోడికి బాక్స్ ఆఫీస్ హిట్ దక్కలేదు. ఇటీవల మహర్షి సినిమాలో స్పెషల్ రోల్ చేసి మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. 

అదే క్రేజ్ తో ఇప్పుడు తన రెగ్యులర్ కామెడీ కథలను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు. వినాయక చవితి సందర్బంగా నరేష్ బంగారు బుల్లోడు సినిమా స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. దీపావళి సందర్బంగా తన కామెడీ మూవీ విడుదల కానున్నట్లు స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాకు పివి గిరి దర్శకుడు. అయితే ఈ సినిమా కోసం అల్లరి నరేష్ మహేష్ సహాయాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. 

ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ ని పిలిపించాలని చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు టాక్. బంగారు బుల్లోడు సినిమాను నిర్మిస్తున్న ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాకు కూడా సహా నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. అలాగే నరేష్ మహర్షి సినిమాతో మహేష్ కి క్లోజ్ అయ్యాడు కాబట్టి మహేష్ కి రెండు వైపులా ఇన్విటేషన్స్ అందనున్నాయి. మరి మహేష్ సినిమా కోసం ఎంతవరకు హెల్ప్ అవుతారో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్
Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌