
కామెడీ అండ్ ఎంటర్ టైన్ మూవీలతో అలరించి, ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు అల్లరి నరేష్. ఒకనాకొక దశలో తన సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురు చూసే పరిస్థితిని కూడా తీసుకొచ్చాడు. ఒక్క ఏడాదికి మినిమ్ నాలుగు సినిమాలు పూర్తి చేసేవాడు. కానీ ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించగా సినిమాల జోష్ ను తగ్గిస్తూ వచ్చాడు. ఒకటి రెండు సినిమాలతోనే సరిపోడుతున్నాడు. దీంతో అల్లరి నరేష్ క్రేజ్ కూడా తగ్గుతూ వస్తోంది. కానీ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ మూవీలో ఫ్రెండ్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశాడు. తర్వాత ‘బంగారు బుల్లోడు’, నాంది మూవీల్లో నటించారు. ‘సభకు నమస్కారం మూవీ’ఇంకా షూటింగ్ జరుపుకుంటోంది.
ప్రస్తుతం సరికొత్త కథాంశంతో అల్లరి నరేష్ 59 మూవీ ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని కూడా ఈ రోజే పూర్తి అయ్యింది. హాస్య మూవీస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అల్లరి నరేష్, ఆనంది హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజా మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ డీవోపీగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే షూటింగ్ షెడ్యూల్ ను ప్రారంభించుకోనుంది.