రాకేష్ మాస్టర్ విగ్రహం చూశారా... కానీ ఫ్యాన్స్ నాట్ హ్యాపీ!

Published : Aug 04, 2023, 04:36 PM IST
రాకేష్ మాస్టర్ విగ్రహం చూశారా... కానీ ఫ్యాన్స్ నాట్ హ్యాపీ!

సారాంశం

ఆలేటి ఆటం తన గురువుపై ప్రేమతో విగ్రహం తయారు చేయించాడు. తన సొంత డబ్బులతో రాకేష్ మాస్టర్ విగ్రహం రూపొందించారు. ఈ విషయాన్ని కొరియోగ్రాఫర్ బషీర్ తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.

ఇటీవల రాకేష్ మాస్టర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యం బారినపడిన రాకేష్ మాస్టర్ గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పక్కనే ఉంటూ యోగక్షేమాలు చూసుకుంటున్న ఆలేటి ఆటం మొదట ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆర్థిక కారణాలతో చివరి నిమిషంలో గాంధీ ఆసుపత్రికి చేర్చారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రాకేష్ మాస్టర్ వీడియోలు కలచివేశాయి. నా చావును కూడా వీడియో తీయాలని గతంలో రాకేష్ మాస్టర్ కోరుకున్నారు. నిజంగా అదే జరిగింది. రాకేష్ మాస్టర్ చివరి రోజులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. 

రాకేష్ మాస్టర్ శిష్యుల్లో ఒకడైన శేఖర్ మాస్టర్ స్మారక సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఆయన శిష్యులు, పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు. రాకేష్ మాస్టర్ కి నివాళులు అర్పించారు. కాగా ఆలేటి ఆటం తన గురువుపై ప్రేమతో విగ్రహం తయారు చేయించాడు. తన సొంత డబ్బులతో రాకేష్ మాస్టర్ విగ్రహం రూపొందించారు. ఈ విషయాన్ని కొరియోగ్రాఫర్ బషీర్ తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. 

ఆలేటి ఆటం ఈ విగ్రహాన్ని తయారు చేయించాడని వెల్లడించాడు. రాకేష్ మాస్టర్ విగ్రహం బ్రాహ్మణుని రూపంలో ఉంది. అలా చేయించడానికి ఒక కారణం ఉంది. గతంలో రాకేష్ మాస్టర్ ఢీ షో చేశారు. అప్పుడు కమల్ హాసన్ దశావతారం మూవీలోని 'రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు' సాంగ్ కి అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అప్పుడు జడ్జెస్ రాకేష్ మాస్టర్ ని నేరుగా తీసుకెళ్లి జడ్జి సీటులో కూర్చోబెట్టి గౌరవించారు. ఆ అద్భుతమైన క్షణాలకు గుర్తుగా ఆ సాంగ్ లో రాకేష్ మాస్టర్ వేసిన గెటప్ లో విగ్రహం తయారు చేయించారు. 

అయితే రాకేష్ మాస్టర్ విగ్రహం పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు నచ్చలేదని కామెంట్స్ చేస్తున్నారు. అది రాకేష్ మాస్టర్ విగ్రహంలా లేదు, పుల్లయ్య గాడి విగ్రహంలా ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. కొందరు మాత్రం చాలా బాగుందని అంటున్నారు. మరి ఈ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ముక్కుసూటితనం కలిగిన రాకేష్ మాస్టర్ టాలెంట్ ఉండి కూడా పరిశ్రమలో ఎదగలేకపోయాడు.. 
 

PREV
click me!

Recommended Stories

Toxic : యష్ అభిమానులకు షాక్! టాక్సిక్ రిలీజ్ మళ్లీ వాయిదా పడిందా? అసలు నిజం ఇదే!
Raaka : అల్లు అర్జున్ రాకా లో బిగ్ ట్విస్ట్.. బన్ని కోసం రంగంలోకి బాలీవుడ్ బాద్షా..