నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్..!

Published : Mar 05, 2019, 04:28 PM IST
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్..!

సారాంశం

దర్శకనిర్మాత మహేష్ భట్ రెండో కూతురు అలియా భట్ నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలను నిర్మించాలని అనుకుంటోంది. 

దర్శకనిర్మాత మహేష్ భట్ రెండో కూతురు అలియా భట్ నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలను నిర్మించాలని అనుకుంటోంది.

ఇప్పటికే అలియా భట్ సోదరి పూజా భట్ నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు సోదరి బాటలో అలియా కూడా నిర్మాతగా మారాలని నిర్ణయించుకుంది. సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టింది. దాని పేరు 'ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్'.

తాజాగా దీనికి సంబంధించిన అధికార ప్రకటన చేసింది అలియా. ఈ బ్యానర్ పై మంచి సినిమాలు తీయలనుకుంటున్నట్లు వెల్లడించింది. దీన్ని బలమైన నిర్మాణ సంస్థగా మారుస్తానని నమ్మకంగా చెబుతోంది.

ఒక ఆడియన్ గా తాను ఎలాంటి సినిమాలు తెరపై చూడాలని అనుకుంటుందో అటువంటి సినిమాలే నిర్మిస్తానని అలియా తెలిపింది. హీరోయిన్ గా బాలీవుడ్ లో తన క్రేజ్ చాటుతోన్న ఈ బ్యూటీ నిర్మాతగా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Ram Gopal Varma: మైఖేల్ జాక్సన్ అంటే అంత ద్వేషం ఎందుకు? ఆర్జీవీ ఎమోషనల్ పోస్ట్
Karthika Deepam 2 Today Episode:సూపర్ ఎపిసోడ్-జ్యోతో ఓ రేంజ్ లో ఆడుకున్న దీప,కార్తీక్-అమ్మ ఒడికి దీప