
ఈమధ్య సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ పై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయింది. ఈ విషయంలో తలపట్టుకు కూర్చుంటున్నారు స్టార్స్. తమను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోనీయడంలేదంటూ వాపోతున్నారు సినిమా తారలు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండి.. కాస్త చల్లగాలి పీల్చుకుందాం అని బయటకు వస్తే.. చుట్టుముట్టి చంపేస్తున్నారు. ఫోటోల కోసం తమను కాల్చుకు తింటున్నారంటూ బాధపడుతున్నారు సెలబ్రిటీలు. ముఖ్యంగా ఫోటో గ్రాఫర్లపై తారలు మండిపడుతున్నారు. ఇంట్లోకి కూడా దూసుకొచ్చేసి ఫోటోలు తీస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్.. ఫోటో గ్రాఫర్లకు వార్నింగ్ కూడా ఇచ్చాడు.. మా బెడ్ రూమ్స్ లోకి వచ్చి ఫోటోలు తీయ్యండీ అంటూ కూల్ గానే చురకలంటించాడు. ఇక ఆ వేవ్స్ ఇప్పుడు రణ్ బీర్, ఆలియా భట్ ఫ్యామిలీపై కూడా పడింది.
తాజాగా అలియా, రణబీర్ ఫొటోగ్రాఫర్స్ పై ఫైర్ అయ్యారు. తమ పర్సనల్ లైఫ్ ను డిస్ట్రబ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. అలియా, రణబీర్ కి పాప పుట్టిన తర్వాత నుంచి వీరిపై మీడియా, ఫొటోగ్రాఫర్స్ ఫోకస్ మరింత ఎక్కువైంది. పాపను చూసుకుంటూ ఆలియా భట్ ఇంట్లోనే ఉంటోంది. దాంతో పాప ఫోటోలు ఎలాగైనా సాధించాలని కొంత మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలియా భట్ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టారు. అందులో భాగంగా.. పక్కింట్లో కెమెరాలు పెట్టి.. ఆలియాను క్యాప్చర్ చేయాలని ట్రై చేశారు. రీసెంట్ గా అలియా తన ఇంట్లో బాల్కనీలో కూర్చొని ఉండగా.. తనని ఎవరో గమనిస్తున్నారని అనుమానం వచ్చి చూస్తే.. పక్క బిల్డింగ్ పై నుంచి కెమెరాలు పట్టుకొని తమ ఇంటివైపు చూస్తున్నారని గమనించింది. వెంటనే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా వెల్లడించింది బ్యూటీ.
ఇక ఈ విషయంలోమరోసారి ఫైర్ అయ్యింది అలియా భట్. ఆమె మాట్లాడుతూ.. నాతో తమాషా చేస్తున్నారా? మాకు వ్యక్తిగత జీవితం అవసరం లేదా..? అన్నీ మీకు తెలియాలా..? ఎంత ధైర్యం ఉంటే మా ఇంటిపై కెమెరాలతో నిఘా పెడతారు, ఇక ఎప్పుడూ మా వెనకాలే ఉంటారా అంటూ సీరియస్ అయింది ఆలియా. తరువాత మాట్లాడిన రణబీర్ కూడా తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు. మీకు మీజీవితంలో పర్సనల్ అంటూ ఎలా ఉంటుందో.. మాకు కూడా అంతే ఉంటుంది. మేమేమి బొమ్మలం కాదు. మాకు ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. మీరు మా ఇంట్లోకి వచ్చేస్తారా? ఇంట్లో కూడా తొంగిచూస్తారా? ఇది చాలా తప్పు కదా అన్నారు.
అంతే కాదు.. ఇండస్ట్రీలో ఫొటోగ్రాఫర్స్, మేము కలిసి పనిచేయాలి. మాకు మీరు అవసరం, మీకు మేము అవసరం. కానీ మీరు ఇలా మమ్మల్ని ఇబ్బందిపెడుతూ.. దొంగతనంగా మా పర్సనల్ లైఫ్ నుప్ర భావితం చేస్తే, మీమీద మాకు చిన్న చూపు ఏర్పడుతుంది. అంతే కాదు దీనిపై మేము అవసరం అయితే చట్టపరంగా వెళ్ళడానికైనా రెడీగా ఉన్నాము. అసలు మా ఇంట్లో కెమెరాలు పెట్టడం ఏంటీ..? తలుచుకుంటేనే చిరాగ్గా ఉంది. అసహ్యం వేస్తుంది అంటూ.. అసహనం వ్యాక్తం చేశారు రణ్ బీర్. ఇక ప్రస్తుతం రణ్ బీర్ , ఆలియా వ్యాక్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.