ఫ్లాష్ బ్యాక్: మహేష్ కథలో హీరోగా ఆలీ

Published : Feb 25, 2019, 06:56 PM IST
ఫ్లాష్ బ్యాక్: మహేష్ కథలో హీరోగా ఆలీ

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు చేయాల్సిన ఒక ఫాంటసీ డ్రామా సినిమాను కమెడియన్ అలీ చేశాడు అంటే ఎవరైనా నమ్మగలరా?. కానీ ఇది నిజం. మహేష్ బాబు దక్కాల్సిన అఫర్ అదృష్టవశాత్తు ఆలీ కొట్టేశాడు. కమెడియన్ గానే కాకుండా ఆలీ కథానాయకుడిగా కూడా మంచి మంచి ఆఫర్స్ ను అందుకొని కెరీర్ లో మరచిపోలేని హిట్స్ అందుకున్నాడు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఎస్వీ.కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆలీ యమలీల అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. 1994లో విడుదలైన ఆ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.  మొదట దర్శకుడు ఈ సినిమా కథను మహేషే కోసం రాసుకున్నాడట. అయితే సూపర్ స్టార్ కృష్ణ ,మహేష్ తో సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. 

ఎందుకంటే అప్పట్లో మహేష్ స్టడీస్ తో బిజీగా ఉండడంతో కృష్ణ అప్పుడే సినిమాల్లోకి వద్దని గ్యాప్ ఇచ్చారట. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి ఆలీ ని సెలెక్ట్ చేసుకోవడంతో కమెడియన్ తో సినిమా ఏమిటని చాలా మంది వద్దని చెప్పారు. అయినా కూడా కథ మీద నమ్మకంతో దర్శకుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలీ తెలియజేశాడు. 

PREV
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌