అల వైకుంఠపురములో.. పాటల పండగ ఎప్పుడంటే?

Published : Sep 06, 2019, 03:56 PM IST
అల వైకుంఠపురములో.. పాటల పండగ ఎప్పుడంటే?

సారాంశం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో.. సినిమాపై అంచనాల డోస్ పెరగడం స్టార్ట్ అయ్యింది. సినిమాకు సంబందించిన స్పెషల్ లుక్స్ తో చిత్ర యూనిట్ అభిమానులను సంతృప్తిపరిచింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో.. సినిమాపై అంచనాల డోస్ పెరగడం స్టార్ట్ అయ్యింది. సినిమాకు సంబందించిన స్పెషల్ లుక్స్ తో చిత్ర యూనిట్ అభిమానులను సంతృప్తిపరిచింది. నెక్స్ట్ థమన్ తన పాటలతో  మరింత హైప్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. 

ఇక సాంగ్స్ పండగ నవంబర్ లో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అల వైకుంఠపురములో.. టైటిల్ కి తగ్గట్టుగా సాంగ్ ని క్లాసికల్ స్టైల్ లో థమన్ సిద్ధం చేయనున్నట్లు టాక్. ఈ టాక్ ఎంతవరకు నిజమో అనే విషయాన్నీ పక్కనపెడితే సినిమా మొదటి సాంగ్ ని మాత్రం నవంబర్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అయినట్లు థమన్ ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. 

ప్రస్తుతం గ్యాప్ లేకుండా షూటింగ్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్ సినిమా షూటింగ్ ని డిసెంబర్ లో ఎలాగైనా ఫినిష్ చేయాలనీ టార్గెట్ గా పెట్టుకుంది.సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ముందే ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ డిఫరెంట్ మూవీ ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ - చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే