'అల‌... వైకుంఠ‌పురములో..' ఈ మెలోడీ విన్నారా..?

Published : Sep 28, 2019, 11:57 AM IST
'అల‌... వైకుంఠ‌పురములో..' ఈ మెలోడీ విన్నారా..?

సారాంశం

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా అల..వైకుంఠపురములో. ఈ సినిమాలోని తొలి మెలొడీ పాట ‘సామజవరగమనా’ వీడియో సాంగ్‌ను తాజాగా విడుల చేశారు.  

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'అల‌... వైకుంఠ‌పురములో..' సినిమాలో మొదటి పాటను చిత్రబృందం శనివారం నాడు విడుదల చేసింది.

'నీ కాళ్ల‌ను ప‌ట్టుకు వ‌ద‌ల‌న‌న్న‌వి చూడే నా క‌ళ్లు..ఆ చూపుల‌న‌లా తొక్కుతూ వెళ్ల‌కు ద‌య‌లేదా అస‌లు... సామ‌జ వ‌ర‌గ‌మ‌న.. నిను చూసి ఆగ‌గ‌ల‌నా..' అంటూ సాగే ఈ పాటను బన్నీ తన ప్రేయసి పూజాహెగ్డే కోసం పాడతాడు. త‌మ‌న్ కంపోజిష‌న్‌లో సిద్ శ్రీరామ్ ఈ పాట‌ను పాడ‌గా, సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. 

ఈ పాట వీడియో మధ్యలో సినిమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే, రాహుల్ రామకృష్ణ, నవదీప్ మధ్య వచ్చే సన్నివేశాలను చూపించారు.  ఈ చిత్రంలో టబు, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సుశాంత్, వెన్నెల కిశోర్, సునీల్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సచిన్ ఖెడేకర్ కీలక పాత్రలు పోషించారు.

హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, గీతాఆర్ట్స్ ప‌తాకాల‌పై అల్లు అర‌వింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే