అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన పెళ్లిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లపైనా స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
ఇప్పటికే ఓ ఇంటివాడు కావాల్సిన అక్కినేని అఖిల్ (Akkineni Akhil) ప్రస్తుతం బ్యాచిలర్ లైఫ్ నే ఎంజాయ్ చేస్తున్నారు. ఆరేండ్లకిందనే తన మాజీ ప్రియురాలు శ్రియా భూపాల్ తో అఖిల్ కు ఎంగేజ్ మెంట్ కూడా జరిగిన విషయం తెలిసిందే. వీరి నిశ్చితార్థానికి చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యారు. ఆ నెక్ట్స్ ఈయరే వీరి మ్యారేజ్ కూడా గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేశారు. అంతలోనే కొన్ని కారణాలతో వివాహా వేడుకను రద్దు చేశారు. ఆ తర్వాత నుంచి అఖిల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనేది? అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ క్రమంలో అప్పుడిప్పుడు నెట్టింట కూడా అఖిల్ పెళ్లిపైనా రూమర్లు వినిపిస్తున్నాయి. తనకు మరో గర్ల్ ఫ్రెండ్ ఉందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 2023 (CCL)లో దుమ్ము లేపుతున్నారు. తెలుగు వారియర్స్ కు కెప్టెన్ గా ఫోర్లు, సిక్సులతో అదరగొడుతున్నారు. ఈ క్రమంలో ఓ అమ్మాయితో పెళ్లి, డేటింగ్ అంటూ రూమర్లు వచ్చాయి. తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అఖిల్ తన పెళ్లిపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
అఖిల్ మాట్లాడుతూ.. నా పెళ్లిపై రకరకాలుగా రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి ఆలోచన లేదు. ప్రస్తుతం పెళ్లి మాటలేదు. ఇంకొన్నాళ్లు సింగిల్ గానే. నా దృష్టిలో లవ్ అనేది స్పోర్ట్స్ లాంటిదే’అని చెప్పుకొచ్చారు. దీంతో అక్కినేని హీరో పెళ్లిపై వస్తున్న రూమర్లకు అడ్డుకట్ట పడింది. ఇక తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. స్ట్రెస్ బస్టర్ అని కూడా చెప్పారు. తనకు క్రికెట్ ఆడుకునేందుకు 15 మందితో కూడిన ఓ టీమ్ ఉందని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆ బ్యాచ్ అలాగే కొనసాగుతోందన్నారు.రెండు మూడు రోజులకోసారైనా తను క్రికెట్ ఆడుతానని చెప్పుకొచ్చారు.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం తనకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. పర్సనల్ పోస్టులు పెట్టడం షైగా ఉంటుందని తెలిపారు. అందుకే తన అభిమానులు అవుతూ ఉంటారన్నారు. కేవలం వృత్తిపరమైన పోస్టులు మాత్రమే పెడుతుంటానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అఖిల్ నటించిన ‘ఏజెంట్’ (Agent)చిత్రం రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్సే దక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నటుడు మమ్ముట్టీ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే నెల ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.