ఇంక ఏజెంట్ ఓటిటి లో రాదులే అని ఫిక్సైన సమయంలో ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటన వచ్చి షాక్ ఇచ్చింది. సెప్టెంబరు 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది.
అఖిల్ అక్కినేని (Akhil Akkineni), సురేందర్ రెడ్డి (Surender Reddy) కాంబినేషన్ వచ్చిన 'ఏజెంట్' #Agent సినిమా విడుదలయి నెలలు దాటింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పొందిన ఘోర పరాజయాన్ని ఎవరూ మర్చిపోలేదు. అదే సమయంలో ఈ సినిమా ఓటిటిలో ఎప్పుడు వస్తుందో చూద్దామనే ఆలోచన పోలేదు.రిలీజ్ అయిన మూడు వారాలకే అంటే మే 19 ఈరోజు ఈ సినిమా ఓటిటి లో వచ్చేస్తోంది అని సోనీ లివ్ (SonyLiv)మొదట్లోనే ప్రకటించింది. కానీ ఇన్నాళ్లుదాకా ఈ సినిమా ఓటిటి లో రాలేదు. దాంతో మీడియాలో ఏజెంట్ మూవీ ఓటీటీలోకి రాదా? ఇన్ని రోజులైనా ఇంకా ఎందుకు ఈ సినిమా రాలేదు? అనే రచ్చ మొదలైంది. మరికొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి ..మళ్లీ ఎడిటింగ్ చేసి కొత్త వెర్షన్ రెడీ చేస్తున్నారంటూ ప్రచారం మొదలెట్టారు. దాంతో ఓటీటీలో ఏజెంట్ ను కొత్తగా చూడొచ్చని సంబర పడ్డారు అక్కినేని ఫ్యాన్స్. కానీ అలాంటిదేమీ జరగటం లేదని తేలిపోయింది. స్వయంగా నిర్మాత అనీల్ సుంక రీ-ఎడిట్ లాంటివేం జరగడం లేదని స్పష్టంచేశారు.
మొత్తానికి ఇంక ఏజెంట్ ఓటిటి లో రాదులే అని ఫిక్సైన సమయంలో ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటన వచ్చి షాక్ ఇచ్చింది. సెప్టెంబరు 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు ఐదు నెలల తర్వాత ఓ సినిమా ఓటీటీలోకి రానుంది. అయితే ఈ మధ్యకాలంలో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. ఏదన్నా సినిమా ఫెయిలై ఓటిటిలో వచ్చాక మళ్లీ వార్తల్లోకి వస్తోంది. థియేటర్ లో చూడని చాలా మంది ఓటిటిలో చూసి కామెంట్స్ మొదలెడుతున్నారు. మొన్న భోళా శంకర్ చిత్రానికి అదే జరిగింది. ఇప్పుడు ఏజెంట్ కు సైతం అదే రిజల్ట్ రాబోతోందా అని ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అందరూ ఆ సినిమాని మర్చిపోతున్న టైమ్ లో ఓటిటిలో వచ్చి మళ్లీ గుర్తు చేయటం మానుతున్న గాయాన్ని పనిగట్టుకుని కెలకటమే అంటున్నారు.
The wait is over! Brace yourself for the wild adrenaline rush!
The Agent starring Mammotty and Akhil Akkineni will be streaming on Sony LIV from 29th Sept. pic.twitter.com/zYL0ljh8M1
ఇక ఈ సినిమా విడుదల అయినా తరువాత పెద్ద వివాదమే అయింది. ముందు ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర (AnilSunkara) ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టి అందులో ఈ సినిమా వైఫల్యానికి కారణం బౌండ్ స్క్రిప్ట్ లేకపోవటమే అన్నాడు. అలాగే భాద్యత అంతా తన మీదే వేసుకున్నాడు కూడా. అతను దర్శకుడు సురేందర్ రెడ్డి (SurenderReddy) ప్రస్తావన తేలేదు. కొన్ని రోజుల తరువాత అఖిల్ అక్కినేని #AkhilAkkineni కూడా ఒక నోట్ పెట్టాడు. అందులో తాను ఎంతో కష్టపడి చేశాను అని, అలాగే చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అని చెపుతూ అందరికీ థాంక్స్ చెప్పాడు. అలాగే మళ్ళీ స్ట్రాంగ్ గా ఇంకో సినిమాతో వస్తాను అన్నాడు. కానీ అఖిల్ కూడా సురేందర్ రెడ్డి గురించి ప్రస్తావించలేదు. ఈ సినిమాలో సాక్షి వైద్య (SakshiVaidya) హీరోయిన్ గా ఆరంగేట్రం చేసింది.
దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో.. చాలా థియేటర్స్ నుండి ఈ సినిమాని తీసేసి... ఆ ప్లేస్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష మూవీని ప్రదర్శించారు. అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా ఇలా అనూహ్యంగా డిజాస్టర్ రిజల్ట్ తెచ్చుకోవడం తట్టుకోలేకపోతున్నారు. చాలా రోజుల నుండి ఓ మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ.. రిజల్ట్ తారుమారయ్యింది.