అజిత్ - షాలినీ ప్రేమ పెళ్లికి 23ఏళ్లు.. అప్పట్లో వీళ్లిద్దరి మధ్య సీక్రేట్ లవ్ కోడ్ ఏంటో తెలుసా..?

Published : Apr 26, 2023, 11:43 AM IST
అజిత్ - షాలినీ ప్రేమ పెళ్లికి 23ఏళ్లు.. అప్పట్లో వీళ్లిద్దరి మధ్య సీక్రేట్ లవ్ కోడ్ ఏంటో తెలుసా..?

సారాంశం

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్ళి చేసుకున్న జంటలెందరో ఉన్నారు. వారిలో చాలా స్పెషల్ అంటే అజిత్ , షాలినీ అనే చెప్పుకోవాలి. తాజా వీరు 23 వ పెళ్లి రోజును జరుపుకున్నారు. ఈసందర్భంగా షాలిని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.   


ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రేమ జంటలు ఉన్నారు. ఎంతో మంది పెళ్ళిళ్లు చేసుకున్నారు. ఎంతో మంది విడాకులు కూడా తీసుకున్నారు. కాని దాదాపు 23 ఏళ్ళగా తమ ప్రేమ బంధాన్ని కొనసాగిస్తూ..భార్య.. భర్తలుగా అందరికి ఆదర్శంగా ఉంటూ  వస్తున్నారు. ఏప్రిల్ 25 నాటికి వీరి పెళ్ళి జరిగి  23 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా.. తమ ప్రేమ బంధాన్ని గుర్తు చేసుకుంటూ.. స్పెషల్ పోస్ట్ ను పెట్టారు. 

తన భర్తతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు షాలినీ.. తమ పెళ్ళి రోజున గుర్తు చేసుకుంటూ.. ప్రేమతో 23 సంవత్సరాలు అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం షాలినీ పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వీరు ప్రేమించుకునే సమయంలో వీరిద్దరు మాట్లాడుకోవడం కోసం సీక్రేట్ కోడ్ నుఉపనయోగించేవారట. ఈ విషయాన్ని వీరితో కలిసి నటించిన కుంచకో బోబన్ ఓ సందర్భంగా వెల్లడించారు. 

 షాలినితో కలసి నటించిన కుంచకో బోబన్ షేటింగ్ సందర్భంగా వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు వీరి ప్రేమకు సహకరించేవారట. అప్పట్లో మొబైల్స్ లేకపోవడం.. షూటింగ్ కోసం ఇద్దరు.. వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళడంతో.. ఇద్దరు మాట్లాడుకోవడం కోసం షాలినీ.. బోబన్ ఫోను నువాడేవారట. అయితే ఫోన్ వచ్చినప్పుడు మాత్రం.. వీరి ప్రేమ విషయం బయటకు తెలియకుండా..  తనకు ఎవరు ఫోన్ చేశారనే విషయం బయటకు తెలియకుండా ఉండడం కోసం వీరిద్దరూ సోనా ఏకే 47 కాలింగ్ అనే కోడ్ వర్డ్ ఉపయోగించే వారిని చెప్పారు. 

ఇలా అజిత్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు తనకు ఫోన్ ఇవ్వడంతో అనుమానం వచ్చిన ఈ సినిమా డైరెక్టర్ కమల్ కుంచకోను ఇదే విషయం అడిగితే ఆయన అసలు విషయం చెప్పారట. మరుసటి రోజు కమల్ షాలినినీ పిలిచి ఏకే 47 ఈరోజు ఎందుకు ఫోన్ చేయలేదని అడగడంతో ఆమె సిగ్గుతో చిరునవ్వు నవ్వింది అని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?