“జై పూరి జై జై పూరి ’అంటున్న 'ఆర్.ఎక్స్. 100' డైరక్టర్

Published : May 15, 2019, 07:31 PM IST
“జై పూరి  జై జై  పూరి ’అంటున్న 'ఆర్.ఎక్స్. 100' డైరక్టర్

సారాంశం

రాంగోపాల్ వర్మ శిష్యుడు, 'ఆర్.ఎక్స్. 100' చిత్రంతో సూపర్ హిట్‌ను అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి  “జై పూరి జై జై పూరి ’ అనటం వైరల్ గా మారింది. ఆయన హఠాత్తుగా అలా అనటానికి కారణం ..ఈ రోజు రామ్ హీరోగా పూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రం టీజర్ చూడటమే.

రాంగోపాల్ వర్మ శిష్యుడు, 'ఆర్.ఎక్స్. 100' చిత్రంతో సూపర్ హిట్‌ను అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి  “జై పూరి జై జై పూరి ’ అనటం వైరల్ గా మారింది. ఆయన హఠాత్తుగా అలా అనటానికి కారణం .. ఈ రోజు రామ్ హీరోగా పూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రం టీజర్ చూడటమే. ఆ టీజర్ చూసిన వెంటనే ఆయన స్పందించారు. రామ్ ఛేంజోవర్ చూస్తూంటే ఖచ్చితంగా ప్రామిసింగ్ హిట్ పడేటట్లు ఉందని అన్నారు. 

'ఆర్.ఎక్స్. 100'  చిత్రం తర్వాత రామ్‌తో అజయ్ భూపతి సినిమా ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రామ్... ఇప్పుడు పూరి జగన్నాథ్‌తో చేతులు కలిపి సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో 'ఇస్మార్ట్ శంకర్' తెరకెక్కుతోంది. 

తన గురువు రామ్ గోపాల్ వర్మ మార్క్ మెరుపులతో తొలి చిత్రాన్ని రూపొందించిన అజయ్ భూపతికి 'ఆర్.ఎక్స్. 100' సక్సెస్ తర్వాత బాగానే ఆఫర్లు వచ్చాయి. ఆరేడు మంది యంగ్ హీరోలు అజయ్‌తో సినిమాలు తీయాలని ఉత్సాహపడ్డారు కూడా. అయితే అజయ్ భూపతి సెకండ్ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్