మరోసారి మణిరత్నంతో ఐశ్వర్యరాయ్!

By Udaya DFirst Published Apr 4, 2019, 10:42 AM IST
Highlights

మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్ చాలా సార్లు నటించింది. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. 

మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్ చాలా సార్లు నటించింది. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మరోసారి మణిరత్నం తన సినిమాలో ఓ పాత్ర కోసం ఐశ్వర్యరాయ్ ని తీసుకుంటున్నట్లు సమాచారం.

పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు మణిరత్నం. ఇందులో స్టార్ నటీనటులను తీసుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పటికే చియాన్ విక్రమ్, హీరో కార్తి, జయం రవిలను ఫైనల్ చేసినట్లు సమాచారం. నటి కీర్తి సురేష్ ని కూడా తీసుకుంటున్నట్లు టాక్.

తాజాగా ఐశ్వర్యారాయ్ పేరు కూడా వినిపిస్తోంది. దాదాపు ఆమె ఎంట్రీ ఖాయమని అంటున్నారు. డిసంబర్ లో ప్రారంభం కాబోయే సినిమా షూటింగ్ లో హీరోలందరూ జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఐశ్వర్యరాయ్ మాత్రం చాలా తక్కువ కాల్షీట్స్ కేటాయించిందని, ఆమె పోర్షన్ వీలైనంత తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా మొదటి చోళరాజు రాజరాజ చోళ చరిత్రకి సంబంధించిందని తెలుస్తోంది. 
 

click me!