#AishwaryaRai:ఐశ్వర్య ఆస్ది మొత్తం ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు

By Surya Prakash  |  First Published Nov 21, 2023, 9:56 AM IST

ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఐశ్వర్యారాయ్ తన  సంపదను తెలివైన పెట్టుబడుల రూపంలో ఇన్వెస్ట్ చేస్తారు. 



  ఐశ్వర్య రాయ్ బచ్చన్‌... ఎంత వయస్సు వచ్చినా వన్నె తరగని అందం ఆమె సొంతం. మిస్‌ వరల్డ్‌ కిరీటం వరించిన ఆమె ఒక నటిగా, బచ్చన్‌ కుటుంబానికి కోడలిగా, మంచి భార్యగా, తల్లిగా ఎప్పుడూ బాధ్యతలు మర్చిపోలేదు.  ఈ  వయస్సు వచ్చినా  ఐశ్వర్య రాయ్ అంటే ఇప్పటికీ ఎంతోమందికి క్రష్. చాలా  మందికి కలల రాకుమారి. ఎవరైనా అందంగా ఉన్నారని చెప్పాలంటే ఐశ్వర్యతోనే పోల్చే స్దాయి ఆమెది.  రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో, అనేక భాషల్లో నటించిన ఐశ్వర్య ఆస్ది ఎంత ఉంటుంది, ఎంత సంపాదించి ఉంటుందనేది అందరికీ ఆసక్తే. అసలు ఆమె కు ఎంత ఉండవచ్చు?

బాలీవుడ్ మీడియా వర్గలా నుంచి అందుతున్న సమాచారం మేరకు ఐశ్వర్యాయార్ నెట్ వర్త్ ఎస్టిమేషన్ ...776  కోట్లు అని తెలుస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతురాలైన నటి ఆమె.  ఒక్కో సినిమాకు ఆమె దాదాపు  10-12 కూడా వసూలు చేస్తుంది. అలాగే ఆమె సినిమాని బట్టి కాకుండా తన పాత్ర నిడివిని బట్టి తీసుకుంటుందిట. అలాగే సింగిల్ డే ఎండార్స్ మెంట్స్ కూడా ఉన్నాయి. ఆమె రోజుకు 6 నుంచి ఏడు కోట్లు తీసుకున్న ప్రాజెక్టులు కూడా ఉన్నాయట. ఇన్నేళ్ల కాలంలో ఆమె భారత్ లోనూ ప్రపంచంలోనూ నెంబర్ వన్ గా ఉన్న అనేక ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసి ఉన్నారు. ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఐశ్వర్యారాయ్ తన  సంపదను తెలివైన పెట్టుబడుల రూపంలో ఇన్వెస్ట్ చేస్తారు. 
  
ఇక 1994లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇరువార్(తెలుగులో ఇద్దరు) చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ ప్రపంచ సుందరి.. అనంతరం తమిళం, హిందీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే  'హమ్ దిల్ దే చుక్', 'దేవదాస్' చిత్రాల్లో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది. బాలివుడ్ లోనే కాదు కొన్ని హాలివుడ్ చిత్రాల్లోనూ ఐశ్వర్య నటించింది. 'బ్రైడ్ అండ్ ప్రీజూడిస్', 'ప్రోవోక్డ్' లాంటి సినిమాలతో హాలివుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఐశ్వరరాయ్ తెలుగులో చాలావరకు తమిళ్ డబ్బింగ్ చిత్రాలలోనే కనిపించింది. తెలుగులో హీరోయిన్ గా నటించనప్పటికీ ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది ఐశ్వర్య. 1999లో నాగార్జున హీరోగా నటించిన రావోయి చందమామ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ లో కనిపించింది.  

Latest Videos

తన కెరీర్ లో ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. 2009లో ఐశ్వర్య భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. 2007లో ఆమె బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది.  
 

click me!