పవన్ కి 'మహర్షి' టీమ్ స్పెషల్ ట్రీట్!

Published : May 13, 2019, 09:55 AM IST
పవన్ కి 'మహర్షి' టీమ్ స్పెషల్ ట్రీట్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసిన ప్రముఖులందరూ కూడా చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు వంశీ పైడిపల్లికి స్వయంగా ఫోన్ చేసి విష్ చేశారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాను చూడబోతున్నారని సమాచారం. రైతు సమస్యలను ఎమోషనల్ గా హృదయాలను హత్తుకునే విధంగా తెరకెక్కించిన ఈ సినిమాను చూడడానికి పవన్ ఆసక్తి కనబరుస్తుండడంతో చిత్రయూనిట్ స్పెషల్ షోకి ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

నిజానికి పవన్ కళ్యాణ్ కి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. తన ఫాంహౌస్ కి వెళ్లి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. తాను కూడా రైతునే అంటూ మీడియాలో చెబుతుంటారు.

తాజాగా 'మహర్షి' సినిమాలో మహేష్ బాబు రైతుగా కనిపించడంతో పాటు రైతు సమస్యలకు మంచి పరిష్కారం చూపించడంతో పవన్ కళ్యాణ్ కి సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు పవన్ సినిమా చూడబోతున్నాడని అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మహేష్ ఫ్యాన్స్ లో కూడా ఉత్సాహం నెలకొంది. 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?