ఎవర్ గ్రీన్ కామెడీ సినిమా..@31 ఇయర్స్!

By Prashanth MFirst Published Nov 27, 2018, 6:21 PM IST
Highlights

టాలీవుడ్ లో ఎన్నేళ్లయినా ది బెస్ట్ కామెడీ చిత్రాల లిస్ట్ తీస్తే టాప్ లో జంధ్యాల కామెడీ సినిమాలకే స్థానం దక్కుతుంది. స్వచ్ఛమైన కామెడీ కుటుంబంతో కలిసి చూసే సినిమాలను ఎన్నో డైరెక్ట్ చేసిన జంధ్యాల కెరీర్ లో అహ నా పెళ్ళంట ఒకటి.

టాలీవుడ్ లో ఎన్నేళ్లయినా ది బెస్ట్ కామెడీ చిత్రాల లిస్ట్ తీస్తే టాప్ లో జంధ్యాల కామెడీ సినిమాలకే స్థానం దక్కుతుంది. స్వచ్ఛమైన కామెడీ కుటుంబంతో కలిసి చూసే సినిమాలను ఎన్నో డైరెక్ట్ చేసిన జంధ్యాల కెరీర్ లో అహ నా పెళ్ళంట ఒకటి. రాజేంద్ర ప్రసాద్ - రజినీ జంటగా నటించిన ఈ సినిమా ద్వారా బ్రహ్మానందం కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 

సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తుంది. ఇక కోట శ్రీనివాసరావు పిసినారి పాత్ర బ్రహ్మి హావభావాలు సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించాయి. అసలు విషయంలోకి వస్తే.. ఆ ఎవర్ గ్రీన్ కామెడీ ఎంటర్టైనర్ వచ్చి నేటికీ 31 ఏళ్ళు అవుతోంది. 1987 నవంబర్ 27న రిలీజైన అహ నా పెళ్ళంట అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి అత్యధిక కలెక్షన్స్ ను అందుకున్న చిత్రంగా నిలిచింది. 

కామెడీ సినిమాలతో కూడా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకోవచ్చని దర్శకుడు జంధ్యాల సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఆ సినిమా తరువాత రాజేంద్ర ప్రసాద్ బిజీగా మారగా బ్రహ్మి అయితే వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికి ఆ సినిమాలో కామెడీ సీన్స్ ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవనే చెప్పాలి. సురేష్ ప్రొడక్షన్ లో డి రామానాయుడు అహ నా పెళ్ళంట సినిమాను నిర్మించారు. ఈ సినిమా టైటిల్ తోనే అల్లరి నరేష్ కూడా ఆహ నా పెళ్ళంట అంటూ 2011 చేసిన కామెడీ ఎంటర్టైనర్ మంచి సక్సెస్ ను అందుకుంది.

click me!