నాగార్జున మేనకోడలితో అడివి శేష్ పెళ్లి..?

Published : Feb 19, 2019, 04:24 PM IST
నాగార్జున మేనకోడలితో అడివి శేష్ పెళ్లి..?

సారాంశం

అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియకి యంగ్ హీరో అడివి శేష్ కి పెళ్లి కాబోతుందనే వార్తలు టాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంలో డేటింగ్ చేస్తోన్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతుందని సమాచారం. 

ఇటీవల అడివి శేష్ కూడా త్వరలోనే పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అప్పుడు కూడా నెటిజన్లు పెళ్లి వార్త చెప్పబోతున్నావా..? అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో నిజంగానే అడివి శేష్ పెళ్లి వార్తలు వెలుగులోకి వచ్చాయి.

సుప్రియతో అడివి శేష్ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా రాబోతుందని సమాచారం. అన్నీ కుదిరితే డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఆ వ్యవహారాలన్నీ తానే దగ్గరుండి చూసుకుంటానని అక్కినేని కోడలు సమంత చెబుతోందట. గతేడాది అడివి శేష్ నటించిన 'గూఢచారి' సినిమాలో సుప్రియ కూడా కీలక పాత్రలో కనిపించింది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి