‘ఆదిపురుష్’ కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వారంలో రాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (PRabhas), బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) సీతారాములుగా నటించిన చిత్రం Adipurush. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీ-సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రంగానూ.. రామాయణం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. భారీ విజువల్ ఎక్స్ పీరియన్స్ ను అందించేందుకు త్రీడీలోనూ తెరెక్కించబోతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మరోవైపు చిత్రం రిలీజ్ కు సంబంధించిన పనులనూ చకచకా పూర్తి చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ‘ఆదిపురుష్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కొద్దిసేపటి కిందనే యూనిట్ ప్రకటించింది. బోర్డు నుంచి U సర్టిఫికెట్ పొందినట్టు వెల్లడించారు. అదే విధంగా మూవీ రన్ టైమ్ ను కూడా రివీల్ చేశారు. సినిమా మొత్తం రెండు గంటల 59 నిమిషాలు నిడివిని కలిగి ఉంది. రన్ టైమ్ కూడా లెన్తీగానే ఉండటంతో అభిమానులకు విజువల్ ట్రీట్ అందనుందని చెప్పొచ్చు..
వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్ తర్వాత ‘ఆదిపురుష్’ నుంచి అప్పట్లో వచ్చిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. మరోవైపు మొన్నతిరుపతిలో నిర్వహించిన ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ రెండో ట్రైలర్ ను విడుదల చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ విజువల్ వండర్ గా ఉండబోతోందనేలా ట్రైలర్లు అంచనాలు పెంచాయి. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ వైబ్సే కనిపిస్తున్నాయి. కలెక్షన్ల పరంగానూ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల ప్రకారం సరికొత్త రికార్డులు సృష్టించబోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
యూనిట్ మునుపెన్నడూ లేనివిధంగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. వినూత్నంగానూ ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. చిత్రాన్ని రిలీజ్ కు ముందు ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబోతుండటం విశేషం. ఇప్పటికే కొన్ని చోట్ల బుకింగ్స్ కూడా ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. సీతారాములుగా ప్రభాస్ - కృతి శెట్టి నటించగా.. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవ్ దత్త హన్మంతుడిగా అలరించబోతున్నారు. సైఫ్ అలీఖాన్ రావణసురుడి పాత్రను పోషించారు. జూన్ 16న ఈ భారీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Stunning VFX, Superb Music, Heart-touching dialogues... This trailer has it all! shines as Lord Ram with his powerful dialogue delivery and amazing cutout. 🔥
Get ready for something colossal across the world! 🌍✨ 🏹🛕
Final Trailer Out Now -… pic.twitter.com/bDJ0LNHx0S