500 మందితో అదిరిపోయే రికార్డ్ కోసం...విజయ్ దళపతి ప్రయత్నం, ఏం చేస్తున్నారంటే..?

Published : Jun 08, 2023, 01:29 PM ISTUpdated : Jun 08, 2023, 01:30 PM IST
500 మందితో అదిరిపోయే రికార్డ్ కోసం...విజయ్ దళపతి ప్రయత్నం, ఏం చేస్తున్నారంటే..?

సారాంశం

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి.. రేర్ రికార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న లియో షూటింగ్ సెట్ దానికి వేదిక కాబోతోంది. 

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో  తెరకెక్కుతున్న సినిమా లియో. ఈసినిమాతో త్రిష హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయబోతుంది. మాస్టర్ సినిమా తరువాత ఈ ఇద్దరు స్టార్ల కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళంతో పాటు.. తెలుగులో కూడా ఈసినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. అలా స్టార్ట్ అయ్యిందో లేదో.. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుందీ సినిమా. అప్పుడే క్లైమాక్స్ కు వచ్చేసింది. 

ఇక లియో సినిమా తాజా షెడ్యూల్ ను చెన్నైలో మంగళవారం  మొదలుపెట్టారు. అయితే ఈ షెడ్యూల్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈషెడ్యూల్ లో అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఒక పాటను చిత్రీకరించనున్నారు. ఇది విజయ్ ఇంట్రడక్షన్ సాంగ్. ఈ పాటలో 500 మంది డాన్సర్లు కనిపించనున్నారని అంటున్నారు. ఎక్కువ మంది డాన్సర్లు పాల్గొనడం వలన, రెండు వారాల పాటు ఈ పాట షూటింగ్  నే జరిగే అవకాశం ఉన్నట్టుతెలుస్తోంది. ఈ షెడ్యూల్ చాలా అంటే చాలా ప్రత్యేకం కాబోతోంది. 

ఈ ప్రత్యేకమైన పాటకు దినేశ్ మాస్టర్   కొరియోగ్రఫీని అందిస్తున్నాడు. అంతే కాదు ఈ భారీ స్ధాయి సాంగ్ షూటింగ్ కోసం భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. తమిళ సంగీత సంచలనం  అనిరుధ్ అందించిన బాణీ మాస్ ఆడియన్స్ లోకి ఒక రేంజ్ లో దూసుకెళుతుందని చెబుతున్నారు. సంజయ్ దత్ .. అర్జున్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అక్టోబర్ 19వ తేదీన విడుదల కానుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా