ఆదిపురుష్ నుంచి అదిరిపోయే అప్ డేట్, సీతగా కృతి సనన్ స్పెషల్ లుక్ రిలీజ్

Published : Apr 29, 2023, 09:17 AM IST
ఆదిపురుష్ నుంచి అదిరిపోయే అప్ డేట్, సీతగా కృతి సనన్ స్పెషల్ లుక్ రిలీజ్

సారాంశం

అనుకున్నట్టుగానే వరుస అప్ డేట్స్ రిలీజ్ చేస్తున్నారు ఆదిపురుష్ టీమ్. ఈసినిమాలోని పాత్రల నుంచి ఒక్కోక్కరి లుక్స్ ను రిలీజ్ చేస్తూ వస్తున్న టీమ్.. తాజాగా జానకి లుక్ లో కృతి సనన్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.   

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. కృతి సనన్ జతగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో విలన్ రావణబ్రహ్మపాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. శ్రీరామనవమి నుంచి వరుస అప్ డేట్స్ ఇస్తామని ఆదిపురుష్ టీమ్ ప్రకటించారు. అనుకున్నట్టుగానే వరుసగా అప్ డేట్స్ ఇస్తున్నారు టీమ్. తాజాగా సీత లుక్ లో కృతి సనన్ స్పెషల్ లుక్ ను రిలీజ్ చేసింది టీమ్. 

రామ్ సీతా రామ్ అంటూ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో.. జానకిగా కృతీ సనన్ నారచీరలతో ఉన్న స్పెషల్ మోషన్ పోస్టర్ మంత్ర ముగ్ధులను చేస్తోంది. సీతా నవమి సందర్భంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. భారతీయ చరిత్రలో అందరూ అత్యంత గౌరవం ఇచ్చే మహిళల్లో ఒకరైన జానకీదేవికి ఆదిపురుష్ టీమ్ అంకితం ఇచ్చింది.  

జానకి పాత్రలో కృతి సనన్ పోస్టర్  స్వచ్ఛత, దైవత్వం, ధైర్యం ఉట్టిపడేలా కనిపిస్తోంది.ఈ లుక్ కు తగ్గట్టు  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా సెట్ అవ్వడంతో.. ఈ పోస్టర్ చూడగానే భక్తి భావం ఉట్టిపడి.. ఆధ్యాత్మిక చింతనలోకి తీసుకెళ్తుంది. ప్రస్తుతం సీత పాత్రలో కృతీసనన్ మోషన్ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈమూవీ నుంచి సీతారామచంద్రుల ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. రాముడు, హనుమంతుడు, రావణుడి పోస్టర్స్ రిలీజ్ చేసిన టీమ్.. తాజాగా జానకి పోస్టర్ ను పంచుకున్నారు. 

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్, టి-సిరీస్, భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రెట్రోఫైల్స్‌కు చెందిన రాజేష్ నాయర్ మరియు యువి క్రియేషన్స్‌కు నుంచి వంశీ ప్రమోద్ ఆదిపురుష్ సినిమాను నిర్మించారు, 16 జూన్ 2023న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది సినిమా. రాముడిగా ప్రభాస్ ను ఎలా చూపించబోతున్నారు అనేది ఉత్కంటగా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్