‘టిల్లు స్క్వేర్’ నుంచి థమన్ తప్పుకోవడానికి అసలు కారణం ఇదే!

Published : Mar 18, 2024, 10:53 PM IST
‘టిల్లు స్క్వేర్’ నుంచి థమన్ తప్పుకోవడానికి అసలు కారణం ఇదే!

సారాంశం

ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ (Thaman S) ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)  నుంచి తప్పుకున్నారు. ఇందుకు అసలు కారణం ఏంటో చెప్పారు నిర్మాత నాగవంశీ.

నాగవంశీ నిర్మించిన ‘డీజే టిల్లు’కు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ Jonnalagadda హీరోగా, అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)  రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పదిరోజుల్లో మూవీ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. 

ఈ సందర్భంగా యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను వదులుతూ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ‘హో మై లిల్లీ’ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. అయితే మొదట ఈ చిత్రానికి థమన్ (Thaman) నుంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కోరారు. ఆయన కూడా ఒప్పుకున్నారు. 

కానీ తర్వాత థమన్ కు బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమాకు వర్క్ చేయలేకపోయారు. ఆయన స్థానంలో భీమ్స్ సిసిరోలియోను తీసుకున్నామని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. సినిమాను సమయానికి ప్రేక్షకులకు అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక థమన్ చివరి ‘గుంటూరు కారం’ సాంగ్స్ తో దుమ్ములేపారు. నెక్ట్స్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’తో ఆకట్టుకోబోతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు
Ileana: ప్రభాస్‌, మహేష్‌, తారక్‌, రవితేజ గురించి ఇలియానా ఒక్క మాటలో