నాలుగో వివాహం చేసుకున్న వనితా విజయ్ కుమార్.. అసలు ట్విస్ట్ ఏంటంటే!

Published : Jul 22, 2021, 05:08 PM IST
నాలుగో వివాహం చేసుకున్న వనితా విజయ్ కుమార్.. అసలు ట్విస్ట్ ఏంటంటే!

సారాంశం

షాక్ ఇస్తూ తమిళ్ పవర్ స్టార్ గా పేరున్న నటుడు శ్రీనివాసన్ ని వివాహం చేసుకున్న ఫోటోలు వనితా సోషల్ మీడియాలో పంచుకున్నారు. శ్రీనివాసన్, వనితా విజయ్ కుమార్ పెళ్లి బట్టలలో మెరిసిపోతుండగా, వీరిద్దరూ వివాహం చేసుకున్నారని అందరూ భావించారు.

కోలీవుడ్ పరిశ్రమలో వనితా విజయ్ కుమార్ ఓ సంచలనం. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే వనితా విజయ్ కుమార్... స్టార్ కిడ్ కావడం విశేషం. ఒకప్పటి హీరోయిన్ మంజుల, నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తెనే ఈ వనితా విజయ్ కుమార్. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న వనితా విజయ్ కుమార్ కోసం, ఓ వివాదమై పోలీసులు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఆమె కాంట్రవర్సీ ఏ స్థాయిలో ఉంటుందో. 


కన్న తండ్రి విజయ్ కుమార్ తోనే ఆమెకు అనేక గొడవలు ఉన్నాయి. ఇక మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనితా విజయ్ కుమార్, మూడింటిని పెటాకులు చేసుకుంది. ఆ మధ్య నాలుగో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు రావడం జరిగింది. అలాగే ఇటీవల  ఓ జ్యోతిష్యుడు వనితా విజయ్ కుమార్ నాలుగో వివాహం చేసుకుంటారని, ఆ వరుడు పేరు ఎస్ అక్షరంతో ప్రారంభం అవుతుందని తెలిపారు. అలాగే వనితా త్వరలో రాజకీయ ప్రవేశం చేసి జయలలిత మాదిరి చక్రం తిప్పుతారని చెప్పారు.


ఇక షాక్ ఇస్తూ తమిళ్ పవర్ స్టార్ గా పేరున్న నటుడు శ్రీనివాసన్ ని వివాహం చేసుకున్న ఫోటోలు వనితా సోషల్  మీడియాలో పంచుకున్నారు. శ్రీనివాసన్, వనితా విజయ్ కుమార్ పెళ్లి బట్టలలో మెరిసిపోతుండగా, వీరిద్దరూ వివాహం చేసుకున్నారని అందరూ భావించారు. అలాగే జ్యోతిష్యుడు చెప్పిన మాట నిజమైందని అనుకున్నారు. అయితే ఈ ఫోటోలు నిజమైనవి కాదట. వనితా, శ్రీనివాసన్ కలిసి నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించిన స్టిల్స్ అని సమాచారం. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్సే టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా