హైదరాబాద్ లో సావిత్రి ఇల్లు ఎక్కడో తెలుసా..?

Published : May 14, 2018, 12:21 PM IST
హైదరాబాద్ లో సావిత్రి ఇల్లు ఎక్కడో తెలుసా..?

సారాంశం

అలనాటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన 'మహానటి' సినిమా రికార్డు 

అలనాటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన 'మహానటి' సినిమా రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అన్ని ప్రాంతాల నుండి ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం చాలా మంది సావిత్రి గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆమెకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కువగా మద్రాస్ లోనే ఉండే సావిత్రి సినిమా షూటింగ్ ల కోసం అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా వచ్చేవారట.

ఆమెకు చాలా సన్మానాలు హైదరాబాద్ లోనే నిర్వహించారని సమాచారం. అప్పట్లో ఇక్కడి వాతావరణం, పచ్చదనం ఆమెకు బాగా నచ్చేవట. అందుకే హైదరాబాద్ లో రెండు ఇళ్ళను కూడా నిర్మించుకుందని తెలుస్తోంది. హైదరాబాద్ యూసఫ్ గూడలో ఎకరం భూమిని కొని అందులో తన అభిరుచికి తగ్గట్లుగా రెండు అందమైన భవనాలను నిర్మించుకున్నారట. 196౦లో జరిగిన ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఆ ఇంటి బాల్కనీలో కూర్చొని ఎదురుగా ఉండే చెరువును చూస్తూ సమయాన్ని గడిపేవారట సావిత్రి. కొన్నాళ్ళకు ఆ ఇళ్ళను సావిత్రి అక్క భర్త స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ భవనాల స్థానంలో ఆపార్ట్మెంట్ ను నిర్మించేశారు. ఆ చెరువును మూసేసి కృష్ణకాంత్ పార్క్ ను ఏర్పాటు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌