పోలీస్ స్టేషన్ లో హీరోయిన్!

Published : Jan 20, 2019, 10:35 AM IST
పోలీస్ స్టేషన్ లో హీరోయిన్!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఇటీవల హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కమర్షియల్ హీరోయిన్ గా బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని చూస్తోంది. 

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఇటీవల హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కమర్షియల్ హీరోయిన్ గా బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని చూస్తోంది.

ఇది ఇలా ఉండగా.. సారా తన తల్లి అమృతాసింగ్ తో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ ఆస్తి వివాదం కారణంగా సారా తన తల్లితో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సివచ్చింది. క్లెమెంటన్ లో అమృతాసింగ్ మామ మధుసూదన్ కి 24 ఎకరాలా భూమి, ఇల్లు ఉన్నాయి. 

ఇటీవల ఆయన కిడ్నీసంబంధిత వ్యాధితో మృతి చెందారు. దీంతో ముంబై నుండి అమృతాసింగ్, సారా ఆలీఖాన్ ఇతర బంధువులు మధుసూదన్ అంతిమసంస్కారాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో మధుసూదన్ ఇంటి కేర్ టేకర్ ఖుషీరామ్ అనే వ్యక్తి తన యజమానికి చెందిన ఆస్తి విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అమృతాసింగ్ తో పటు ఇతర బంధువులు ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించినట్లు అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అమృతా తన కూతురు సారాతో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్లి 25 నిమిషాల పాటు పోలీసులకు తమ ఫిర్యాదు వినిపించి తిరిగి అక్కడ నుండి వెళ్లిపోయారు. మరి ఈ ఆస్తుల గొడవలు ఎప్పటికి తేలుతాయో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే