భర్త ఎస్‌ఐ వసంత్‌రాజాపై నటి రాధ మరోసారి ఫిర్యాదు

Published : Jul 04, 2021, 09:22 AM IST
భర్త ఎస్‌ఐ వసంత్‌రాజాపై  నటి రాధ మరోసారి ఫిర్యాదు

సారాంశం

ఎస్‌ఐ అయినా భర్త వసంత్‌రాజా తనని మళ్లీ వేధిస్తున్నానడని, హత్య చేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నారని చెన్నైలోని స్థానిక సెంట్‌ థామస్‌ మౌంట్‌జాయింట్‌ కమిషనర్‌ నరేంద్రన్‌ నాయర్‌కి ఆమె శనివారం ఫిర్యాదు చేసింది.

`సుందరా ట్రావెల్స్` ఫేమ్‌ నటి రాధ తన రెండో భర్తపై మరోసారి ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ అయినా భర్త వసంత్‌రాజా తనని మళ్లీ వేధిస్తున్నానడని, హత్య చేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నారని చెన్నైలోని స్థానిక సెంట్‌ థామస్‌ మౌంట్‌జాయింట్‌ కమిషనర్‌ నరేంద్రన్‌ నాయర్‌కి ఆమె శనివారం ఫిర్యాదు చేసింది. వసంత్‌రాజాతోపాటు ఆయనకు సహకరిస్తున్న ఇన్‌స్పెక్టర్లు ఇళంవరుది, భారతి అనే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 

నటి రాధా `సుందరా ట్రావెల్స్` చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆమెకి ఈ చిత్రం తర్వాత పెద్దగా అవకాశాలురాలేదు. దీంతో ఆమె ఓ నిర్మాతని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థాల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఎస్‌ఐ వసంత్‌ రాజాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మనసులు కలిశాయి. కొన్నాళ్లపాటు కలిసి ఉన్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. కొన్నిరోజుల తర్వాత వసంత్‌ రాజా తనని వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె పోలీసులను ఆశ్రయించింది. విరుగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిద్దరికి రాజీ కుదిర్చారు. ఇప్పుడు మరోసారి తనని వేధిస్తున్నాడంటూ రాధా ఫిర్యాదు చేయడం గమనార్హం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?