తల్లైన బిగ్‌ బాస్‌ బ్యూటీ.. పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన పూజా రామచంద్రన్‌..

Published : Apr 30, 2023, 08:20 AM IST
తల్లైన బిగ్‌ బాస్‌ బ్యూటీ.. పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన పూజా రామచంద్రన్‌..

సారాంశం

నటి పూజా రామచంద్రన్‌ తల్లి అయ్యింది. ఆమె తాజాగా పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది.  

`స్వామిరారా`, `దోచేయ్‌` వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన నటి పూజా రామచంద్రన్‌ తల్లి అయ్యింది. ఆమె పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని తన భర్త జాన్‌ కొక్కెన్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇందులో చిన్నారి.. తన వేలుని, తన భర్త జాన్‌  వేలుని పట్టుకుని ఉండగా తీసిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. తమ ఆనందాన్ని పంచుకున్నారు.

అయితే తన కుమారుడికి పేరు కూడా నిర్ణయించారు. `కియాన్‌ కొక్కెన్‌` అనే పేరు పెట్టినట్టు వెల్లడించారు. `మా హృదయాలను, జీవితాలను ఆనందంతో నింపడానికి ఇదితో మా లిటిల్‌ బాయ్‌ వచ్చాడు. ఈ ప్రపంచానికి కియాన్‌ కొక్కెన్‌కు స్వాగతం. మీ అందరి ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలు` అని పేర్కొన్నారు ఈ జంట. దీంతో ఆమె అభిమానులు, సెలబ్రిటీలు వారికి విషెస్‌ తెలియజేస్తున్నారు. 

పూజా రామచంద్రన్‌ స్టడీస్‌ చేసే సమయంలోనే `మిస్‌ కొయబత్తూర్‌ 2004` టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. అట్నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోకి అడుగుపెట్టింది. వీడియో జాకీగా, మోడల్‌గా, అట్నుంచి నటిగా మారింది. 2011లో `7ఏఎం అరివు` అనే తమిళ చిత్రంతో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో మెప్పించిన ఈ భామ `లవ్‌ ఫెయిల్యూర్‌` చిత్రంతో తెలుగుకి పరిచయం అయ్యింది. నిఖిల్‌ `స్వామిరారా` చిత్రంతో ముఖ్య పాత్ర దక్కింది. దీంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు తమిళం, మరో వైపు తెలుగు, మలయాళం చిత్రాల్లో నటిస్తూ అలరిస్తుంది. 

టాలీవుడ్‌లో ఆమె ఇంకా `ఆడవి కాచిన వెన్నెల`, `దోచేయ్‌`, `త్రిపుర`, `దళం`, `సిద్ధార్థ`, `మరల తెలుపునా ప్రియా, `కృష్ణార్జున యుద్ధం`, `వెంకీ మామా`, `ఎంత మంచి వాడవురా`, `పవర్‌ ప్లే` వంటి చిత్రాల్లో నటించింది. చివరగా ఆమె `ఇప్పుడు కాక ఇంకెప్పుడు` చిత్రంలో మెరిసింది. పూజా బిగ్‌ బాస్‌ రెండో సీజన్‌లో పాల్గొని అలరించిన విషయం తెలిసిందే. ఇక ఆమె .. విలన్‌ పాత్రలతో ఆకట్టుకుంటున్న జాన్‌ కొక్కెన్‌ని 2019, ఏప్రిల్‌ 15న వివాహం చేసుకుంది. గతేడాది నవంబర్‌లో తన ప్రెగ్నెన్సీని ప్రకటించారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్