అత్యంత దుర్భర స్థితిలో పావలా శ్యామల.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు..

Google News Follow Us

సారాంశం

ఒకప్పుడు నవ్వులు పంచిన పావలా శ్యామల ఇప్పుడు మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉంది. ఓ వైపు ఆర్థిక భారం, మరోవైపు వయోభారంతో ఆమె నరకం చూస్తుంది.

కామెడీ పాత్రలతోపాటు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసింది పావలా శ్యామల. ఒకప్పుడు బిజీ ఆర్టిస్టుగా రాణించిన ఆమె ఇప్పుడు పరిస్థితి దయనీయంగా మారింది. గత రెండేళ్లుగా ఆమె దీన స్థితిలో ఉన్నట్టు చెబుతూనే ఉంది. తనని ఆదుకోవాలని, సహాయం చేయాలని వేడుకుంటుంది. మెగాస్టార్‌ చిరంజీవి వంటి కొందరు స్పందించి ఆమెకి ఆర్థిక సాయం అందించారు. ఇప్పుడు మరింత దుర్భరంగా మారిందట. నిస్సాహయ స్థితిలో ఉన్న ఆమె ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తుంది. 

ఒకప్పుడు నవ్వులు పంచిన పావలా శ్యామల ఇప్పుడు మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉంది. ఓ వైపు ఆర్థిక భారం, మరోవైపు వయోభారంతో ఆమె నరకం చూస్తుంది. ఎదిగిన కూతురు కూడా మంచానికి పరిమితం కావడం వల్ల శ్యామల మనోవేదనకు గురవుతుంది. ఆమె కొంత మంది ఆర్థిక సాయం అందించినా, అది తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. ఈ క్రమంలో ఆమె ఇళ్లు గడవడం కోసం వచ్చిన అవార్డులను కూడా అమ్ముకోవడం విచారకరం. వాటి ద్వారా వచ్చిన డబ్బుతో బియ్యం, పప్పులు కొన్న రోజులున్నాయని చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తుంది శ్యామల. 

అనారోగ్యంతోపాటు తినడానికి తిండి లేక పస్తులుంటున్నామని చెప్పింది. మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నామని, ఇలానే ఉంటే తనతోపాటు తన కూతురు కూడా మంచానికే పరిమితమై ఆకలితో చనిపోయే పరిస్థితి వస్తుందని, ఆత్మహత్య చేసుకునేందుకు ధైర్యం సరిపోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమని ఆదుకోవాలని ఆమె వేడుకుంటుంది.

పావలా శ్యామల ప్రస్తుతం ఫిర్జాదీగూడ లోని ఓ వృద్దాశ్రమంలో ఉంటుంది. ఆ ఆశ్రమానికి నెలవారి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతుంది. సాయం కోసం ఎదురుచూస్తుంది. నటి పావలా శ్యామలకు సహాయం చెయ్యాలనుకునేవారు. Neti Shyamala , A/c: 52012871059, IFSC :SBIN0020458, Srikrishna Nager , Yusuf guda Beanch , Hyderabad , Cell : 98 49 175713 సంప్ర‌దించ‌వ‌చ్చు.  `ఖడ్గం`, `ఆంధ్రవాలా`, `బాబాయ్‌ హోటల్‌`, `గోలిమార్‌` వంటి 250కిపైగా చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్యామల. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...