పవన్ హీరోయిన్ కి సీక్రెట్ గా ఆపరేషన్.. ఏం జరిగిందంటే..?

Published : Apr 30, 2019, 12:20 PM ISTUpdated : Apr 30, 2019, 12:21 PM IST
పవన్ హీరోయిన్ కి సీక్రెట్ గా ఆపరేషన్.. ఏం జరిగిందంటే..?

సారాంశం

తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన 'కొమరం పులి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్ కి టాలీవుడ్ లో సరైన అవకాశాలు రాకపోవడంతో కోలివుడ్ కి వెళ్లి అక్కడ అవకాశాల కోసం ప్రయత్నించింది. 

తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన 'కొమరం పులి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్ కి టాలీవుడ్ లో సరైన అవకాశాలు రాకపోవడంతో కోలివుడ్ కి వెళ్లి అక్కడ అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో 'తలైవన్‌', 'కరైయోరం', 'నారదన్‌', 'భాస్కర్‌ ఒరు రాస్కెల్' వంటి చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ జీవీ ప్రకాష్ సరసన ఓ కొత్త చిత్రలో నటిస్తోంది. దర్శకుడు ఎలిల్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలో నికిషా పటేల్ కి రహస్యంగా ఆపరేషన్ జరిగిందని, ఎవరికీ తెలియనివ్వకుండా ముంబైలో సైలెంట్ గా ఆపరేషన్ కానిచ్చేశారని వార్తలు వినిపించాయి.

అయితే దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకి రాలేదు. తాజాగా నికిషా పటేల్ ఈ విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు ఆపరేషన్ జరిగిన మాట నిజమేనని వెల్లడించింది. తనకు చిన్న సర్జరీ జరిగిందని.. ప్రస్తుతం అంతా బాగానే ఉందని తెలిపింది.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు తొందరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఎలిల్ సినిమాలో తన షూటింగ్ పార్ట్ పూర్తయిందని.. కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు  తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: రోహిణీ గతాన్ని వైరల్ చేసిన బాలు, మళ్లీ గుడి ముందు అడుక్కోనున్న మనోజ్?
NNNM: నారీ నారీ నడుమ మురారి మూవీకి ముందు అనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆయన చేస్తే సినిమా వేరే లెవల్‌